Danam Nagender: మమ్మల్ని బతకనివ్వరా.. ఆ అధికారులపై దానం నాగేందర్ సీరియస్
ABN, Publish Date - Jan 22 , 2025 | 04:20 PM
Danam Nagender: ఆపరేషన్ రోప్‌లో భాగంగా చింతల్‌బస్తీ ఏరియాలో అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి అక్కడి రోడ్డును క్లియర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా దానం నాగేందర్ చేరుకున్నారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులకు తనదైన శైలిలో సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్, జనవరి 22: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) హల్ చల్ చేశారు. జీహెచ్‌ఎంసీ (GHMC) చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఎమ్మెల్యే అడ్డుకున్నారు. చింతల్ బస్తిలో పలు నిర్మాణాలను అక్రమాలుగా జీహెచ్ఎంసీ గుర్తించింది. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా చర్యలు తీసుకుంటారని దానం మండిపడ్డారు. కూల్చివేతల ఆపకుంటే జేసీబీ ముందు కూర్చుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌పై, టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే కూల్చివేతలను అడ్డుకోవడంతో దానం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరోసారి వివాదంలోకి ఎక్కారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ రోప్‌లో భాగంగా చింతల్‌బస్తీ ఏరియాలో అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి అక్కడి రోడ్డును క్లియర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా దానం నాగేందర్ చేరుకున్నారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులకు తనదైన శైలిలో సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ‘‘నోటీసులు లేకుండా ఎలా కూల్చివేతలు చేస్తారు. కూల్చివేతలు ఆపకపోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తా. ఎక్కడినుంచో బతకడానికి వచ్చి మమ్మల్ని బతకనివ్వరా? కూల్చివేతల ఆపకపోతే బండి ముందు కూర్చుంటా. నా వెంట వస్తే 100 అక్రమ కట్టడాలు చూపిస్తా.. ముందు అవి కూలకొట్టండి. సీఎం సిటీకి వచ్చిన తర్వాత మాట్లాడతా రెండు రోజులు కూల్చివేతలు ఆపండి’’ స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి..
BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్
Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 22 , 2025 | 04:21 PM