Sankranti 2025: పతంగుల జాతర.. ఆ కైట్స్‌కు భళే గిరాకీ
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:31 AM
Sankranti 2025: ఆకాశం రంగుల మయం అయిందా అన్నట్లుగా గాలిలో పతంగులు ఎగురుతూ కనిపిస్తుంటాయి. బిల్డింగ్‌పైకి ఎక్కి యువత కైట్స్‌ను ఎగురవేస్తుంటారు. మార్కెట్‌లో దొరికే వివిధ రకాల గాలిపటాలను తీసుకువచ్చి పోటాపోటాగా పతంగులు ఎగురవేస్తుంటారు యువత. ఎక్కడికక్కడ భవనాలపై డీజే సౌండ్లతో.. యువత కేకలతో దద్దరిల్లి పోతుంది.
హైదరాబాద్, జనవరి 13: పతంగుల పండుగ అనే పిలుచుకునే సంక్రాంతి పండగు రానే వచ్చింది. సంక్రాంతికి సందర్భంగా స్కూళ్లకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో ఇప్పటికే చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. స్వగ్రామంలో కుటుంబసభ్యుల మధ్య పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటన్నారు. సంక్రాంతి పండగలో ప్రధానంగా వినిపించేది పతంగులు. పండగ వచ్చిందంటే చాలు యువత కైట్స్ ఎగురవేసేందుకు ఉత్సుకత చూపుతుంటారు. కొంత మంది పండుగకు ముందు నుంచే పతంగులను ఎగురవేస్తుంటారు. పండుగ మూడు రోజుల పాటు ఆకాశంలో పతంగుల జాతర కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రంగు రంగుల కైట్స్ చూపరులను కనువిందు చేస్తుంటాయి. ఆకాశం రంగుల మయం అయిందా అన్నట్లుగా గాలిలో పతంగులు ఎగురుతూ కనిపిస్తుంటాయి. బిల్డింగ్‌పైకి ఎక్కి యువత కైట్స్‌ను ఎగురవేస్తుంటారు. మార్కెట్‌లో దొరికే వివిధ రకాల గాలిపటాలను తీసుకువచ్చి పోటాపోటాగా పతంగులు ఎగురవేస్తుంటారు యువత. గట్టి గట్టిగా కేకలు పెడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. వీరి సందడితో పాటు డీజే మోత మోగుతుంది. ఎక్కడికక్కడ భవనాలపై డీజే సౌండ్లతో.. యువత కేకలతో దద్దరిల్లి పోతుంది. సూర్యోదయం అవ్వగానే పరుగున వెళ్లే యువత సాయంత్రానికి గాని ఇంటికి చేరుకోరు. అంతగా సందడి చేస్తారు. ఆడిపాడి ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు మార్కెట్లోకి కొత్తకొత్త పతంగులు అందుబాటులోకి వచ్చాయి. హీరోల ఫోటోలు, అలాగే చిన్న పిల్లలు ఇష్టపడే కార్టూన్ ఫోటోలతోనూ పతంగులు మార్కెట్లోకి వచ్చాయి. పెద్ద మొత్తంలో పతంగులతో మార్కెట్లోనూ సందడి నెలకొంది.
పతంగులకు ఫేమస్ ప్లేస్...
హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో పతంగులను అమ్ముతుంటారు. అయితే పతంగుల అమ్మకానికి పెట్టింది పేరుగా చార్మినార్ వద్ద ఉండే గుల్జార్ హౌజ్ నిలిచింది. ఇక్కడ ఎన్నో వేల రకాల పంతగులు అందుబాటులో ఉంటాయి. గుల్జార్ హౌజ్‌తో పాటు మూసాబౌలి, బేగంబజార్, దూల్ పేట్, లాల్ దర్వాజా తదితర ప్రాంతాల్లో గాలిపటాలను అమ్ముతుంటారు. ఒక్కప్పుడు గుండుబాగు స్థావరంగా నిలిచిన దూల్‌పేట్‌లో ఇప్పుడు పతంగుల అమ్మకాలు జరుగుతున్నాయి. చెడు వ్యాపారన్ని పక్కన పెట్టేసి మరీ పతంగుల తయారీనే వ్యాపారంగా పెట్టుకున్నారు అక్కడి స్థానికులు. అయితే ఈ వ్యాపారంలో ఆశించిన స్థాయిలో ఆదాయం రాదని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. అయినప్పటికీ పతంగుల తయారీకి వెనక్కి తగ్గేదే లేదన్నది వారి మాట. సంక్రాంతిని పురస్కరించుకున్న రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తయారైన వివిధ రకాల కైట్స్ కూడా హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో ఆయా మార్కెట్లలో పతంగుల జోరు కొనసాగుతోంది.
లోకల్ మాంజానే బెస్ట్...
మరోవైపు ఎంతో ప్రమాదకరమైన చైనా మాంజాను ప్రభుత్వం బ్యాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో లోకల్ మాంజాకు భారీగా డిమాండ్ పెరిగింది. నగరంలోని మంగళహట్ ఏరియాలో చాలా మంది లోకల్ మాంజాను తయారుచేస్తుంటారు. లోకల్ మాంజాతో పాటు బరేలీ, కృష్ణ, గన్, సిక్స్ కాట్, 12 కాట్, నైన్ కాట్ అంటూ పలు రకాలు మాంజాలను వారు తయారు చేస్తారు. ఇప్పుడు లోకల్ మాంజాకే గిరాకీ ఎక్కువగా ఉందని వ్యాపారులు సైతం చెబుతున్నారు. చైనా మాంజాతో ప్రమాదం ఉందని.. లోకల్ మాంజానే ఉపయోగించి.. సేఫ్‌గా పతంగులను ఎగురవేయాలని పలువురు చెబుతున్న మాట.
ఆ పతంగులకే గిరాకీ
ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం, వెండి పూతలతో చేసే పతంగులకు భలే గిరాకీ ఉంది. మామూలుగా పేపర్, మెటల్, ప్లాస్టిక్ వంటి ఐటెమ్స్‌తో పతంగులను తయారు చేయడం కామన్. అయితే బంగారం, వెండి పూతలతో చేసిన పతంగులు మార్కెట్లో తెగ సందడి చేస్తున్నాయి. వీటి ధరకు కూడా చాలా కాస్టిలీనే అని చెప్పుకోవాలి. గ్రామ్ గోల్డ్ కోటెట్ గిఫ్ట్ ప్యాక్‌కు ధర రూ.200 నుంచి రూ. 500 వరకు ఉండగా.. సిల్వర్ ప్యాక్ ధర రూ.850 వరకు అమ్ముతున్నారు. ఇక ఈ రెండింతో పాటు జర్మన్ సిల్వర్, మెటల్ రైట్, సిల్వర్ చక్కి, సీసం ఫుడ్, జైపూర్ మీనా ఆర్ట్ వర్క్ తో కూడిన గిఫ్ట్ ప్యాక్స్‌కు మార్కెట్లోకి వచ్చాయి. జనం కూడా వీటిని కొనేందుకు ఎగబడుతున్న పరిస్థితి.
ఎంజాయే కాదు.. జాగ్రత్త కూడా ముఖ్యమే..
కైట్స్ ఎగురవేస్తూ ఎంజాయ్ చేయడమే కాదు.. అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం భారిన కూడా పడే అవకాశం ఉటుంది. పతంగులు ఎగురవేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. పతంగుల కోసం ఉపయోగించే మాంజాను పట్టుకునే ముందు చేతి వేళ్లకు టేప్ చుట్టుకోవడం మరిచిపోవద్దు. దీని వల్ల పతంగులు ఎగురవేసేటప్పుడు మాంజా వల్ల చేతి వేళ్లకు ప్రమాదం జరుగకుండా ఉంటుంది.
గమనిక: పతంగులు ఎగురవేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రహరీ గోడ ఉండే బిల్డింగ్‌లను ఎంచుకోవాలి. అలాగే కరెంట్ తీగల విషయంలో కూడా అలర్ట్‌గా ఉండండి.. పండుగను ఎంజాయ్ చేయండి.
ఇవి కూడా చదవండి...
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..
ఈ రాశి వారికి షాపింగ్, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి
Read Latest Telangana News And Telugu News