ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mohanbabu: బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన మంచు మోహన్ బాబు

ABN, Publish Date - Jan 06 , 2025 | 10:00 AM

న్యూఢిల్లీ: సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు మంచు మోహన్ బాబు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జర్నలిస్ట్ పై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మెహన్ బాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.

హైదరాబాద్: నటుడు, నిర్మాత, దర్శకుడు మంచు మోహన్ బాబు (Manchu Mohanbabu) బెయిల్ (Bail) కోసం సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. జర్నలిస్ట్ పై దాడి కేసు (Journalist Attack Case)లో ఆయనకు ముందస్తు బెయిల్ (Anticipatory bail) ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) నిరాకరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మెహన్ బాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. తన వయసు 78 ఏళ్లని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని అందుచేత తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు నుంచి తనకు సానుకూల తీర్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేయడం వల్ల ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో హత్యాయత్నం ఆరోపణలపై మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కోర్టు ఆదేశాల ఉల్లంఘన.. గత నెల డిసెంబర్ 24న పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ఆయన పాటించలేదు. ఈ క్రమంలో మోహన్ బాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.


మంచు ఫ్యామిలీలో ఇటీవల వరసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ వ్యవహార శైలితో.. ఆ కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్లుగా పరిస్థితి మారింది. మోహన్ బాబు మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎక్కడ ఆలస్యం లేదని సీపీ స్పష్టం చేశారు. ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలని చెప్పారు. మోహన్ బాబుకు నోటీస్ ఇచ్చామని.. గత నెల డిసెంబర్24 వ తేదీ వరకు సమయం అడిగారని తెలిపారు. 24 వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు కూడా మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. ఆ తర్వాత కూడా ఆయన రాలేదన్నారు. రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్స్ లేవని తేల్చిచెప్పారు. మోహన్ బాబు వద్ద రెండు గన్స్ ఉన్నాయన్నారు. డబుల్ బ్యారెల్ ఒకటి . స్పానిష్ మేడ్ రివాల్వర్ ఒకటి ఉందని వివరించారు.


ఇంకోవైపు.. మంచు ఫ్యామిలీలో ఇటీవల ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఏదో జరుగుతుందంటూ ప్రచారం జరిగింది. దీంతో శంషాబాద్ మండలంలోని జల్‌పల్లిలో మోహన్ బాబు నివాసంలోకి మంచు మనోజ్ బలవంతంగా వెళ్లారు. ఆ తర్వాత మోహన్ బాబు ఆడియో క్లిప్ విడుదల చేశారు. అదే సమయంలో మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు.. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇంతలో విలేకర్ల సమావేశంలో మంచు మోహన్ బాబు సీరియస్ అయ్యారు. ఆ క్రమంలో ఓ మీడియా ఛానెల్ జర్నలిస్ట్‌పై ఆయన దాడి చేశారు. ఈ ఘటనపై జర్నలిస్ట్‌లు నిరసన బాట చేపట్టారు. ఈ నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మోహన్ బాబుపై హత్యయత్నం కేసు నమోదు అయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్

బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 06 , 2025 | 10:00 AM