ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Danam Nagender: మరోసారి ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్

ABN, Publish Date - Jan 12 , 2025 | 12:55 PM

హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెప్తున్నాను.. మూసిపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసి నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏపీలు పెట్టించుకుని పడుకున్నారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు.ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే తాను చెబుతున్నానని, అలా అని అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు.

Khairatabad, MLA Danam Nagender

హైదరాబాద్: ఖైరతాబాద్‌ (Khairatabad) ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) మరోసారి హాట్ కామెంట్స్ (Hot Comments) చేశారు. తాను ఏది మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుందన్నారు. ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే తాను చెబుతున్నానని, అలాఅని అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెప్తున్నాను.. మూసిపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసి నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారని విమర్శించారు. వారి ఇళ్ళల్లో చేసిన జొన్న రెట్టేలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుండి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారని అన్నారు. తాను ఫైటర్‌నని, ఉప ఎన్నికకు బయపడనని.. ఎప్పుడో జరిగిన అంశంపై స్టేట్‌మెంట్ కూడా ఇచ్చానన్నారు. హైడ్రాపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడానన్నారు.. దానిని కొంతమంది మీడియా వాళ్ళు చెడుగా ప్రచారం చేస్తున్నారన్నారు.


కేటీఆర్ కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు..

తానేమీ కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. ఈ కార్ రెస్ పెట్టినప్పుడు కేటీఆర్ తన సలహా కూడా తీసుకున్నారని, అప్పుడు తన ఒపీనియన్ మాత్రమే చెప్పానని దానం నాగేందర్ అన్నారు. ఈ కార్ రెస్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని, హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని.. ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి సెట్టిల్ అయ్యాయన్నారు. హైదరాబాద్ సేఫెస్ట్ సిటి కాబట్టి ముంబైకి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారన్నారు. కేటీఆర్ కేసు కోర్టులో ఉంది కాబట్టి తాను కేటీఆర్‌పై మాట్లాడనని అన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్‌లో ఉన్నా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎలాగైనా నెరవేర్చాలని ముందుకెళ్తోందన్నారు. రైతు రుణ భరోసా చేసిన రోజు ఎంతో సంబరాలు చేయాల్సి ఉండే.. కానీ చేయలేదన్నారు. హైడ్రాపై తన వాఖ్యలు ఇప్పుడు కూడా మారదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆలోచించి హైడ్రాపై మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నానన్నారు. మూసికి అనుకుని హై కోర్టు.., ఉస్మానియా లాంటివి ఎన్నో చారిత్రక నిర్మాణాలు ఉన్నాయని, మూసి ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ వార్త కూడా చదవండి..

మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ...


కాగా ‘ఫార్ములా ఈ రేస్‌’తో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగిందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఈ రేస్‌ నిర్వహణతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించగలిగాం. ఇందులో అవినీతి ఉందా.. లేదా.. అనేది ఇప్పుడే చెప్పలేం. అవినీతి లేదని కేటీఆర్‌ చెబుతున్నారు కదా..’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడడం కలకలం సృష్టిస్తోంది. హైడ్రా విషయంలో గతంలో తాను అన్న మాటలకు కట్టుబడి ఉంటానని కూడా దానం స్పష్టం చేశారు. ఓటు బ్యాంక్‌ అయిన ప్రజలను కాపాడుకోవాలని, హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క సీటు కూడా గెలవని సంగతిని గుర్తు చేశారు.

‘‘మన మీద నమ్మకం లేదు. ఇప్పుడైనా నమ్మకాన్ని పెంపొందిచేందుకు ప్రయత్నించాలి. అదీ చేయలేకపోతున్నాం. ఇది ప్రభుత్వానికి ప్రమాదం కాదా’’ అని దానం నాగేందర్ వాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ఒక డీసీపీ స్ధాయి అధికారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే సంతోషం అని, ఎవరి మీదైనా కేసులు పెడతానంటూ వెళ్లడం వల్ల ప్రభుత్వం, ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుందని దానం నాగేందర్‌ అన్నారు. ‘‘ఇలాంటి అధికారులు వస్తుంటారు.. పోతుంటారు. నేనెంతోమందిని చూశా (తలపై జుట్టును చూపుతూ)’’ అని పేర్కొన్నారు. కాగా, ఫార్ములా ఈ రేస్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ విచారణ జరుగుతుండగా, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా దానం చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వీటిపై నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించాయని తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కరీంనగర్ జిల్లా: నీట మునిగిన ఎస్సీ కాలనీ..

రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి

స్వామి వివేకానంద జయంతి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 12 , 2025 | 12:55 PM