Share News

Rajasingh Reaction: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో తీర్పుపై రాజాసింగ్ ఏమన్నారంటే

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:54 PM

Rajasingh Reaction: దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో చనిపోయిన వారంతా పేద ప్రజలని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఒక మతానికి చెందిన వారంతా ఈ బ్లాస్ట్‌లకు పాల్పడ్డారని అయితే చనిపోయిన వారిలో అన్ని మతాల వారు ఉన్నారన్నారు.

Rajasingh Reaction: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో తీర్పుపై రాజాసింగ్ ఏమన్నారంటే
Rajasingh Reaction

హైదరాబాద్, ఏప్రిల్ 8: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఉరిశిక్ష విధించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 12 ఏళ్ల తరువాత తీర్పు రావడం సంతోషకరమన్నారు. ఎన్ఐఏ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ బాంబ్ బ్లాస్ట్ కేసులో చనిపోయిన వారంతా పేద ప్రజలని తెలిపారు. ఒక మతానికి చెందిన వారంతా ఈ బ్లాస్ట్‌లకు పాల్పడ్డారని మండిపడ్డారు. చనిపోయిన వారిలో అన్ని మతాల వారు ఉన్నారన్నారు. జిహాద్ అంటే అమాయకులను చంపడమేనా అని ప్రశ్నించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న యాసిన్ బాత్కాల్ ఇంకా దొరక లేదన్నారు. ఉరిశిక్ష కాకుండా ప్రజా కోర్ట్‌లో ఎన్‌కౌంటర్ చేయాలని ఎన్‌ఐఏ వారిని కోరుతున్నానని.. ఈ మేరకు వారు అనుమతి తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.


కాగా.. 2013, ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దాదాపు 17 మంది మృతి చెందగా.. 150 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఎన్‌ఐఏ... 2016లో ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించి ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో నిందితులు సవాల్ చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ ఐదుగురిని దోషులుగా గుర్తిస్తూ ఉరిశిక్ష విధించింది.


రియాజ్‌ను అందుకే పట్టుకోలేకపోతున్నారు: ఎన్‌ఐఏ స్పెషల్ పీపీ

హైకోర్టు తీర్పుపై ఎన్‌ఐఏ స్పెషల్ పీపీ విష్ణువర్థన్ రెడ్డి ఏబీఎన్‌తో మాట్లాడుతూ... దిల్‌సేఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఈ కేసులో ఐదు మంది నిందితులను దోషులుగా గుర్తిస్తూ ఎన్‌ఐఏ కోర్ట్ ఉరిశిక్ష విధించిందని తెలిపారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించిందన్నారు. కేసులో 150 మంది సాక్షులను న్యాయస్థానంలో స్టేట్‌మెంట్లు ఇప్పించామని.. ఇందులో టెక్నీకల్ ఎవిడెన్స్ , సాక్షుల స్టేట్మెంట్‌లను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దీంతో ఐదు మందికి ఎన్‌ఐఏ కోర్ట్ ఉరిశిక్ష ఖరారు చేసిందన్నారు. ట్రయల్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై నిందితులు వేసిన అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసిందన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి 90 రోజులు ఉంటుందని.. ఈ 90 రోజుల్లో అప్పీల్‌కు వెళ్ళక పోతే డెత్ సెంటెన్స్‌ను అమలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ అలియాస్ మహమ్మద్ రియాజ్ పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడని తెలిపారు. శత్రుదేశం పాకిస్థాన్‌లో ఉండడం వలన రియాజ్ భత్కల్‌ను పట్టుకోవడం కష్టం అవుతోందన్నారు. ఎన్‌ఐఏ సమర్థవంతంగా విచారణ చేసి ఆధారాలు న్యాయస్థానం ముందు పెట్టామన్నారు. నిందితులు దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్ కంటే ముందే హయత్ నగర్‌లో ట్రయల్ బ్లాస్ట్ చేశారని తెలిపారు. తమ వాదనలకు ఏకీభవించి ఐదు మంది దోషులు వేసిన అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసిందని విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

Dilsukhnagar Bomb Blast Case: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం.. ఏమైందంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 12:55 PM