Share News

ACB Notice: కేటీఆర్‌కు మళ్లీ ఏసీబీ నోటీసులు

ABN , Publish Date - Jan 06 , 2025 | 07:44 PM

ACB Notice: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. గచ్చిబౌలిలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.

ACB Notice: కేటీఆర్‌కు మళ్లీ ఏసీబీ నోటీసులు
BRS Working President KTR

హైదరాబాద్, జనవరి 06: ఫార్మూలా ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. జనవరి 9వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాకు వెళ్లిన ఇద్దరు ఏసీబీ అధికారులు.. కేటీఆర్‌కు నోటీసులు అందజేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్మూలా ఈ కారు రేసు వ్యవహారంలో నిబంధనలకు విరుద్దంగా ఈఎఫ్ఓకు నిధులు బదలాయింపు.. అగ్రిమెంట్‌కు ముందే నిధులు చెల్లింపు వల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపించింది. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై విచారణ చేపట్టాలని ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేర్లను ఏసీబీ చేర్చింది. మరోవైపు ఏసీబీ కేసు ఆధారంగా ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో విచారణలో భాగంగా జనవరి 6 వ తేదీ హాజరుకావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.


ఈ విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్.. తన న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఈ విచారణలో పాల్గొనేందుకు న్యాయవాదికి అనుమతి లేదనడంతో.. కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెనుతిరిగారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు హాజరుకావాలంటూ సోమవారం ఏసీబీ అధికారులు కేటీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసి వచ్చారు.
Also Read: విడాకులు ఉండవు.. పొత్తుపై తేల్చేసిన లోకేష్


ఇంకోవైపు ఇదే కేసులో జనవరి 7వ తేదీన ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉండగా.. జనవరి 8,9 తేదీల్లో ఈడీ ఎదుట బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు వారికి ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం విధితమే.

Also Read: షేక్ హసీనా అరెస్ట్‌కు మళ్లీ వారెంట్ జారీ

Also Read: లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 32 మందికి గాయాలు


ఇంతకీ ఏం జరిగిందంటే..

2022, అక్టోబర్‌లో ఫార్మూలా ఈ కారు రేసుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈఎఫ్ఓతో ఒప్పందం చేసుకుంది. సీజ్ 9, 10,11,12 రేసులను నిర్వహించాలనేది ఈ ఒప్పందం ఉద్దేశం. అయితే 2023 ఫిబ్రవరిలో సీజన్ 9 రేసులు జరిగాయి. సీజన్ 10 కి సంబంధించి ప్రమోటర్‌గా వ్యవహరించిన సంస్థ ముందుకు రావడంతో అంతకు ముందున్న త్రైపాక్షిక ఒప్పందం కాస్తా.. ద్వైపాక్షిక ఒప్పందంగా మారింది. ఇది నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకుందని ప్రభుత్వం వాదిస్తోంది.

Also Read: తురకా కిషోర్‌ సోదరులను జైలుకు తరలించిన పోలీసులు

Also Read: రెచ్చిపోయిన మావోయిస్టులు.. భారీ సంఖ్యలో జవాన్లు మృతి

For Telangana News And Telugu News

Updated Date - Jan 06 , 2025 | 07:45 PM