ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sankranti: సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్నారా.. జాగ్రత్త.. ఇదే అదనుగా..

ABN, Publish Date - Jan 12 , 2025 | 07:51 AM

సంక్రాంతి పండుగను సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్‌ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికులు తరలివస్తున్నారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా దొంగలు తమ చేతి వాటం చూపుతారు. స్టేషన్లు, బోగీల్లోకి చేరి చోరీలకు పాల్పడే అవికాశం ఉంది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

హైదరాబాద్: సంక్రాంతి ప్రయాణాలు (Sankranti travels) శుక్రవారం నుంచే మొదలయ్యాయి. విద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా సొంత ఊళ్లకు బయలుదేరిన వారితో రైల్వే స్టేషన్‌ (Railway station), బస్టాండ్ (bus stand) కిటకిటలాడుతున్నాయి. అయితే ప్రయాణీకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇదే అదనుగా దొంగలు (Thieves) తమ చేతి వాటం చూపుతారు. స్టేషన్లు, బోగీల్లోకి చేరి చోరీలకు పాల్పడే అవికాశం ఉంది. అంతర్రాష్ట్ర ముఠాలు (Interstate gangs) కూడా నగరంలోకి ప్రవేశించినట్టు పోలీసులు (Police) గుర్తించి అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్‌ జీఆర్పీ ఎస్పీ చందనదీప్తి రైల్వేస్టేషన్లు, రైళ్లలో భద్రతా చర్యలపై సమీక్షించారు. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చారించారు. ఆభరణాలు, నగదును ఇంట్లో భద్రపరిస్తే దొంగలు కొట్టేస్తారనే ఉద్దేశంతో మహిళలు వెంట తీసుకెళ్తారు. దీంతో దొంగల ముఠాలు ప్రయాణికుల మాదిరిగా ప్లాట్‌ఫాం, బోగీల్లోకి చేరి చోరీలకు పాల్పడుతుంటాయి. రైలు రాగానే బోగీల్లోకి ఎక్కేందుకు పోటీ పడే సమయంలో ప్రయాణికుల మెడలోని గొలుసులు, చేతిలోని సంచులు లాక్కొని మాయమవుతారు. కిటీకీలు, డోర్ల వద్ద కూర్చుని సెల్‌ఫోన్లు మాట్లాడుతున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని స్నాచింగ్‌కు పాల్పడతారు.


కట్టుదిట్టమైన ఏర్పాట్లు

సంక్రాంతి సందర్భంగా రైల్వేస్టేషన్లో ప్రత్యేక భద్రతాచర్యలు తీసుకున్నామని సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. ఎస్పీ చందనదీప్తి ఆదేశాలతో 100 మంది ప్రత్యేక సిబ్బంది, 400 మంది ఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలు బందోబస్తు విధుల్లో నియమించామని తెలిపారు. ఆభరణాలు, నగదుతో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులను గుర్తిస్తే వీడియో తీసి 87126 58586కు వాట్సప్‌నకు పంపాలని సూచించారు.


హైదరాబాద్‌ నుంచి ఒకేరోజు 4 లక్షల మంది రాక

కాగా సంక్రాంతి పండుగను సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్‌ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికులు తరలివస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. రవాణా అధికారుల అంచనా ప్రకారం శనివారం ఒక్కరోజే 4 లక్షల మంది హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరారు. గతేడాది ఇదేరోజున 3 లక్షల మంది రాగా, ఈసారి వీరి సంఖ్య లక్ష పెరిగింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా దాదాపు 2 లక్షల మంది వచ్చారని అంచనా. మరో 2 లక్షల మంది తమ సొంత వాహనాలు, క్యాబ్‌ల్లో వస్తున్నారు. విపరీతమైన రద్దీ నేపథ్యంలో చిల్లకల్లు, కీసర టోల్‌ప్లాజాల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. శనివారం ఉదయం 8నుంచి సాయంత్రం 4 గంటల వరకు 16వేల వాహనాలు వచ్చాయి. అర్ధరాత్రికి ఈ సంఖ్య 20 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ప్రయాణికులతో విజయవాడ బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్‌ కిటకిటలాడుతున్నాయి. షెడ్యూల్‌ రైళ్లతో పాటు అదనంగా 58 సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నడిపినా కూడా సరిపోని పరిస్థితి నెలకొంది. ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నానికి ఆర్టీసీ అధికారులు 200కు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి ఎన్ని బస్సులు పెట్టినా చాలకపోవడంతో విజయవాడలో తిరిగే సిటీ బస్సులు, అద్దె బస్సులు కూడా పంపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం షాక్..

యువతిపై పగబట్టిన కోతి.. కాపాడాలని..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 12 , 2025 | 08:10 AM