Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు
ABN , Publish Date - Apr 09 , 2025 | 02:30 PM
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడి పాస్‌పోర్టు రద్దు అయ్యింది.

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (Former SIB chief Prabhakar Rao) పాస్‌పోర్ట్ రద్దు అయ్యింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులకు పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సమాచారం అందించింది. ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో స్థిరపడేందుకు గ్రీన్‌కార్డు కోసం ప్రభాకర్‌రావు దరఖాస్తు చేసుకున్నారు. గతంలోనే పాస్ పోర్ట్‌ను జప్తు చేస్తున్నట్లు ప్రకటించడంతో గ్రీన్‌కార్డ్ లభించలేదని తెలిసింది. మరోవైపు అమెరికా కాన్సులేట్, కేంద్రం సహకారంతో ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులు సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో శ్రవణ్‌రావును కీలక సూత్రధారిగా భావించిన పోలీసులు.. ఇప్పటికే మూడు సార్లు ఆయనను విచారించారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనను హైదరాబాద్‌కు రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన మాత్రం ఇక్కడకు రాలేదు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు పాస్ట్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా.. హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన ప్రభాకర్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయినప్పటి నుంచి అక్కడే తలదాచుకున్నారు. గతంలో చాలా సార్లు నోటీసులు ఇప్పించినప్పటికీ ప్రభాకర్ రావు ఇండియాకు రాలేదు.. విచారణకు సహకరించలేదు.
Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
దీంతో తెలంగాణ సీఐడీ నుంచి సీబీఐకి లేఖ రాసి.. సీఐబీ ద్వారా ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించిన తర్వాత ప్రభాకర్ రావుకు రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ తర్వాత ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును జప్తు చేస్తున్నట్లు ఇప్పటికే పాస్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియ ప్రకటించింది. దీంతో పాస్‌పార్ట్‌ను ప్రభాకర్ రావు సమర్పించాల్సి ఉంటుంది. కానీ హాండోవర్ చేయకుండా పాస్‌పోర్టును తన వద్దే పెట్టుకోవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభాకర్ రావు పాస్‌పోర్టును రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు అక్కడున్న అమెరికా కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్‌రావును హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టారు.
ఈ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన పాస్‌పోర్టు రద్దు అయ్యింది. ముఖ్యంగా పాస్‌పోర్టును జప్తు చేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో అమెరికాలో స్థిరపడాలని అనుకుంటున్నానని ప్రభాకర్‌రావు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాస్‌పోర్టు రద్దు అవడంతో గ్రీన్‌కార్డు కూడా రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాకర్ రావు వేరే దేశానికి వెళ్లాలని అనుకున్నా, ఇండియాకు రావాలనుకున్న వీలులేదు. అమెరికాలో ఉన్న అధికారులు.. ప్రభాకర్‌రావును ఇంటర్‌పోల్‌కు అప్పగిస్తే.. ఇంటర్‌పోల్ సహాయంతో హైదరాబాద్‌కు రప్పేందుకు ఇక్కడి పోలీసులు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేశారు.
ఇవి కూడా చదవండి
Trump China Tariffs: చైనాపై ట్రంప్ బాదుడు 104 శాతానికి!
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..
Read Latest Telangana News And Telugu News