Share News

Hyderabad Summit:హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ..

ABN , Publish Date - Apr 15 , 2025 | 07:52 PM

Hyderabad Summit: రెండు రోజుల పర్యటన నిమిత్తం కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. ఏప్రిల్ 25వ తేదీన ఆయన హైదరాబాద్ వస్తున్నారు. హైటెక్స్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరగనున్న హైదరాబాద్ సమ్మిట్‌లో ఆయన పాల్గొనున్నారు.

Hyderabad Summit:హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ..
Congress MP Rahul Gandhi

హైదరాబద్, ఏప్రిల్ 15: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ రానున్నారు. ఏప్రిల్ 25, 26వ తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరగనున్న భారత్ సమ్మిట్‌‌లో ఆయన పాల్గొనున్నారు. ఆ క్రమంలో 25వ తేదీ రాహుల్ గాంధీ.. హైదరాబాద్ చేరుకొనున్నారు.

హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ 2025 కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సదస్సుకు 100 దేశాల నుంచి దాదాపు 500 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. అందుకు సంబంధించిన లోగోతోపాటు థీమ్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు సోమవారం ఆవిష్కరించారు.


అలాగే ఈ సదస్సుకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైంకర్, కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున ఖర్గేతోపాటు ఎంపీ రాహుల్ గాంధీ ముఖ్య అతిథులుగా హాజరకానున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు శ్యామ్ పిట్రోడా, సల్మాన్ ఖుర్షీద్, కేసీ వేణుగోపాల్‌, మీనాక్షి నటరాజన్ ఈ సదస్సులో పాల్గొనున్నారు. మరోవైపు రానున్ 25 ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇంకోవైపు దక్కన్ హెరాల్డ్ కేసులో ఈడీ.. తన ఛార్జ్ షీట్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోపాటు శ్యామ్ పిట్రోడా పేర్లను చేర్చింది. అయితే ఇదే వ్యవహారంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ సోమవారం ప్రశ్నించింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే సోనియా, రాహుల్ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్‌లో చేర్చడం గమనార్హం.

ఈ వార్తలు కూడా చదవండి..

Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే..

National Herald Case: ఈడీ ఛార్జ్‌షీట్లో సోనియా, రాహుల్ పేర్లు

BRS MLA: ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి

Farmers: దేశ ప్రజలకు అదిరిపోయే వార్త

Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..

PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..

వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ

For Telangana News And Telugu News

Updated Date - Apr 15 , 2025 | 07:52 PM