Share News

SSMB 29 Video Leak: రాజమౌళి, మహేశ్ బాబుకు షాక్.. ఎస్ఎస్ఎంబీ-29 వీడియో లీక్..

ABN , Publish Date - Mar 09 , 2025 | 05:31 PM

ఎస్ఎస్ఎంబీ-29 చిత్రాన్ని లీకుల భయం వెంటాడుతోంది. హైదరాబాద్‍లో షూటింగ్ సందర్భంగా ఇటీవల సెట్ వీడియో లీక్ కాగా.. తాజాగా మరో వీడియో లీక్ అయ్యింది.

SSMB 29 Video Leak: రాజమౌళి, మహేశ్ బాబుకు షాక్.. ఎస్ఎస్ఎంబీ-29 వీడియో లీక్..
SSMB 29 Video Leak

హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబోలో ఎస్ఎస్ఎంబీ-29 (SSMB 29) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే లీక్‍ల (Video Leak) భయం ఈ చిత్ర యూనిట్‍ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల సినిమా సెట్‍కు సంబంధించిన వీడియో ఒకటి లీక్ అవ్వగా.. తాజాగా చిత్రీకరణకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను చూసిన చిత్ర యూనిట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


హైదరాబాద్‍లో ఇటీవల షూటింగ్ జరిగినప్పుడు సెట్ వీడియో లీక్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా షూటింగ్ వీడియోనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. లీక్ అయిన వీడియోలో మహేశ్ బాబు నడుచుకుంటూ వస్తుంటే.. మరో వ్యక్తి అతన్ని నెట్టుకుంటూ ముందుకు తోస్తున్నాడు. చివరికి చక్రాల కుర్చిలో కూర్చున్న ఓ వ్యక్తి ముందు మహేశ్ మోకాళ్లపై కూర్చుంటాడు. అయితే ఈ షూటింగ్ ఒడిశాలో జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు వీడియో లీక్ కావడంపై మహేశ్ ఫ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ వ్యవహారంపై దర్శకుడు రాజమౌళి, చిత్రయూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.


ఈ వార్తలు కూడా చదవండి:

Urinating on Road: మద్యంమత్తులో రోడ్డుపైనే రచ్చరచ్చ.. పోలీసుల ట్రీట్మెంట్ ఎలా ఉందంటే..

Fire Accident: అంబులెన్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. చివరికి ఏం జరిగిందంటే..

Updated Date - Mar 09 , 2025 | 05:36 PM