Share News

Shamshabad Airport flight delays: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి ప్రయాణికుల ఆందోళన

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:12 PM

Shamshabad airport: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్‌ జెట్ విమానం నిలిచిపోయింది.

Shamshabad Airport flight delays: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి ప్రయాణికుల ఆందోళన
Shamshabad airport

హైదరాబాద్, ఫిబ్రవరి 26: శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad airport) తరచూ విమానాల్లో సాంకేతిలోపాలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా విమానాలు ఆలస్యమవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగుతున్నారు. సరైన సమయానికి గమ్యస్థానాలకు చేర్చాల్సిన విమానాలు ఇలా ఆలస్యం అవడం పట్ల ప్యాసెంజర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. మరోసారి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లా్ల్సిన స్పైస్‌జెట్ విమానం ఆలస్యం అవడమే ఇందుకు కారణం. స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మూడు గంటలుగా విమానం కోసం ప్రయాణికులు ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి.


మూడు గంటలు అవుతున్నప్పటికీ విమానం ఇంకా బయలుదేరకపోవడంపై ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన ప్రయాణికులు విమానం ఆలస్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్పైస్ జెట్‌లో సాంకేతిలోపం తలెత్తిన నేపథ్యంలో ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికులు మండిపడుతున్నారు.

పవన్ దెబ్బకు వైసీపీ క్లీన్ బౌల్డ్


కాగా.. ఇదే నెలలోనే ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఐదున్నర గంటల పాటు ఆలస్యంగా నడిచిన విషయం తెలిసిందే. ఈనెల 7న హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన విమానం ఆలస్యం అవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 10:30 గంటలకు బయలుదేరాల్సిన దాదాపు ఐదున్నర గంటలు ఆలస్యమైంది. ఐదు గంటల పాటు విమానాశ్రయంలో ప్రయాణికులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికుల్లో హీరో విజయదేవరకొండతో పలువరు సీని ప్రముఖులు ఉన్నారు. అలాగే ఇద్దరు ఐఏఎస్‌లు, ఎనిమిది మంది ఐపీఎస్‌ అధికారులు కూడా ఉన్నారు. అయితే కనీస సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి వెయిట్ చేయించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


అంతకు ముందు రోజు కూడా టేకాఫ్‌ తీసుకునేందుకు రన్‌వే వెళ్లిన విమానం ఇంజిన్ మొరాయించడంతో నిలిచిపోయింది. గుహవాటి వెళ్లాల్సిన ఇండియర్ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వే పైకి వచ్చి టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని గమనించిన పైలెట్ వెంటనే ఏటీసీ అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇంజనీరింగ్ నిపుణులు అక్కడకు చేరుకుని దాదాపు గంట పాటు శ్రమించి లోపాన్ని సరిచేశారు. ఆ తరువాత విమానం గుహవాటికి బయలుదేరి వెళ్లింది. అయితే రన్‌వేకు పైకి వెళ్లిన విమానం తిరిగి పార్కింగ్ బే వైపు రావడంతో ప్రయాణికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. అయితే తిరిగి గంటన్నర ఆలస్యంగా విమానం బయలుదేరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి...

Komatireddy Venkatreddy: వారి క్షేమం కోసం మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు

Vamsi in police custody: రెండో రోజు వంశీ విచారణ.. కీలక అంశాలపై ప్రశ్నలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 01:18 PM