Share News

Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:23 AM

Hyderabad: ప్రిజం పబ్‌ కాల్పుల కేసులో నిందితుడు బత్తుల ప్రభాకర్ గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3 వేల రూపాయల దొంగతనం నుంచి మొదలుపెట్టిన ప్రభాకర్.. ఒకేరోజు 3 లక్షలు, ఆపై 33 లక్షలు చోరీ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుని మరీ దొంగతనాలకు పాల్పడ్డాడు.

Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు
Hyderabad Gun Fire

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ఫ్రిజం పబ్‌ కాల్పుల కేసులో (Gun firing Case) నిందితుడు బత్తుల ప్రభాకర్ (Bathula Prabhakar) నేరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రూ.333 కోట్లు సంపాదించి ఆ తర్వాత నేరాలు మానేయాలని ప్రభాకర్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అలాగే ప్రభాకర్ చెస్ట్ మీద రెండు వైపులా పచ్చ బొట్లు ఉన్నాయి. కేవలం ఎనిమిదవ తరగతి వరకు చదివిన ప్రభాకర్.. చిన్ననాటి నుంచే దొంగతనాలకు పాల్పడ్డాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభాకర్‌పై కేసులు ఉన్నాయి. బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర రెడ్డి, రాజు వంటి మారుపేర్లతో హల్‌చల్ చేశాడు ప్రభాకర్.


3 వేల రూపాయల దొంగతనం నుంచి మొదలుపెట్టిన ప్రభాకర్.. ఒకేరోజు 3 లక్షలు, ఆపై 33 లక్షలు చోరీ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుని మరీ దొంగతనాలకు పాల్పడ్డాడు. ఛాతి మీద 3 నెంబర్ టాటూ వేయించుకున్నాడు. నార్సింగ్‌లోని గెటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న ప్రభాకర్.. ఒరిస్సాకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొనుగోలు చేయడమే కాకుండా నెలకో కారు మారుస్తూ జల్సాలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. మరోవైపు పోలీసులపై కాల్పుల కేసులో బత్తుల ప్రభాకర్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 14 రోజుల పాటు బత్తుల ప్రభాకర్‌కు రిమాండ్ విధించింది కోర్టు.

CM Chandrababu: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్


కాగా.. ప్రిజం పబ్బులో బత్తుల ప్రభాకర్ అనే నేరస్తుడు పోలీసులపై కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రెండు తుపాకులను, 23 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ జరిపిన కాల్పుల్లో సైబరాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రాంరెడ్ఢి, ఇద్దరు బౌన్సర్లు గాయపడ్డారు. కానిస్టేబుల్ తోడలోకి బులెట్ దూసుకుపోయింది. గాయపడ్డ కానిస్టేబుల్‌ను స్థానిక కాంటినెంటల్ హస్పిటల్‌కు పోలీసులు తరలించారు. ప్రభాకర్‌‌పై తెలుగు రాష్ట్రాల్లో 80 కేసులు ఉన్నాయని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 16 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2023 నవంబర్ నుంచి ప్రభాకర్‌‌ తప్పించుకుని తిరుగుతున్నాడన్నారు. ప్రిజం పబ్బుకు ప్రభాకర్ తరచూ వస్తున్నట్లు సమాచారం అందడంతో అతడిని పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపినట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు షాక్ కొట్టిస్తున్నాయి..

ఈ రాశి వారు బంధుమిత్రులతో సందడిగా గడుపుతారు !

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 03 , 2025 | 11:34 AM

News Hub