ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ఫార్ములా..ఈ కారు కేసు.. కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

ABN, Publish Date - Jan 15 , 2025 | 08:30 AM

ఫార్ములా ఈ కారు రేస్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీం కోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ ప్రసన్న బి. వరాలే ధర్మాసనం ముందు కేసు విచారణ జరగనుంది.

BRS Leader KTR

న్యూఢిల్లీ: ఫార్ములా ఈ కారు రేస్ కేసు (Formula E car case)కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) దాఖలు చేసిన పిటిషన్‌ (Petition)పై బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. తెలంగాణ హైకోర్టు (Telangana High court) తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ ప్రసన్న బి. వరాలే ధర్మాసనం ముందు కేసు విచారణ జరగనుంది. అయితే తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటిషన్‌పై ఎటు వంటి నిర్ణయం తీసుకోవద్దు అంటూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.) ఇప్పటికే సుప్రీంకోర్టులో కెవియట్ దాఖలు చేసింది.

ఈ వార్త కూడా చదవండి.. 'మహా' జన సంద్రం


క్వాష్ పిటిషన్‌‌..

కాగా కేటీఆర్ ఈ నెల 9వ (గురువారం) తేదీన సుప్రీం కోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌‌ను 10వ తేదీన (శుక్రవారం) విచారణకు తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. 15న విచారణ జరుపుతాని సీజే స్పష్టం చేశారు. అంత అర్జంటుగా కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని సీజే అభిప్రాయపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు... కేటీఆర్‌ వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరినప్పటికీ సుప్రీం కోర్టు సీజేఐ నిరాకరించారు.


కేటీఆర్‌ను విచారించిన ఏసీబీ

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో (Formula E Car Race Case) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) ను ఏసీబీ (anti corruption bureau) విచారించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో పెద్ద మొత్తంలో నిధుల చెలామణీ, అన్యాయంగా ఆర్థిక లావాదేవీలు జరగడం వివాదంగా మారింది. ఈ వివాదంలో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణకు ఎప్పుడు పిలిచినా కూడా రావాలని ఏసీబీ తెలుపగా, కేటీఆర్ వస్తానని చెప్పారు. అయితే పలు రకాల ప్రశ్నలనే 40 విధాలుగా అడిగారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను చెప్పాల్సింది చెప్పినట్లు తెలిపారు. అంతేకాదు ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, రేవంత్ రెడ్డి చెప్పిన ప్రశ్నలనే అధికారులు అడిగారని కేటీఆర్ అన్నారు.


ఈ కేసులో అనేక ఆరోపణలు..

ఈ కేసులో కేటీఆర్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి, అవి నిరూపించడానికి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఈ కేసు చుట్టూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పూర్తి విచారణ కోసం కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఆయన వెంట న్యాయవాది రామచంద్రరావు కూడా హాజరయ్యారు. కేటీఆర్‌ను ముగ్గురు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఈ విచారణ జరగింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ప్రాజెక్టులో నియమాలను ఉల్లంఘించి రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు బదిలీ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి దర్శన టోకెన్ల జారీ.. వాళ్లకు మాత్రమే..

అమరావతి కౌలు రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త

నా వల్ల లక్షల మంది కోటీశ్వరులు అయ్యారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 15 , 2025 | 08:30 AM