Rythubharosa: రైతు భరోసాపై రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:21 PM
Telangana: తెలంగాణ రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే రైతు భరోసాకు అవసరమైన నిధులను సమకూర్చుకుంది సర్కార్. సంక్రాంతి పండుగ నుంచి రైతులు ఖాతాల్లో ఎకరానికి రూ.7500ల చొప్పున రైతు భరోసాను అందించేందుకు సిద్ధమైంది. రైతు భరోసాకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేయడంపై దృష్టి సారించిన సర్కార్..
హైదరాబాద్, జనవరి 2: రైతు భరోసాపై (Rythubharosa) తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కసరత్తు ముమ్మరం చేసింది. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ (Telangana Cabinet sub committee) గురువారం సచివాలయంలో సమావేశమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రైతు భరోసా విధివిధానాలపై సబ్ కమిటీ చర్చించనుంది. రైతు భరోసాపై నివేదికను తయారుచేసి ఈనెల 4న కేబినెట్ ముందు సబ్ కమిటీ ఉంచనుంది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఉద్యోగస్తులకు, ప్రజా ప్రతినిధులకు, ఐటీ పేయర్స్‌కు రైతు భరోసాపై సబ్ కమిటీ చర్చించనుంది. తెలంగాణ రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే రైతు భరోసాకు అవసరమైన నిధులను సమకూర్చుకుంది సర్కార్. సంక్రాంతి పండుగ నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.7500ల చొప్పున రైతు భరోసాను అందించేందుకు సిద్ధమైంది. రైతు భరోసాకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేయడంపై దృష్టి సారించిన సర్కార్.. కేబినెట్ సబ్ కమిటీని నియమించింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సబ్ కమిటీని నియమించింది. సబ్ కమిటీ ఇప్పటికే డిసెంబర్ 29న సచివాలయంలో సమావేశమై విధివిధాలనపై చర్చించిన విషయం తెలిసిందే. దాదాపుగా అన్ని విషయాలలో ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ కొన్నింటిలో ఏకాభిప్రాయం కుదరని పరిస్థితి. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు , ఐటీ పేయర్స్ ఏలాంటి నిర్ణయం తీసుకోవాలి, రైతులకు ఎంత భూమి ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలా? లేదంటే ఇన్ని ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అంటూ కటాఫ్ పెట్టాలా అనే దానిపై సర్కార్ తర్జభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 29న జరిగిన సబ్ కమిటీలో ఈ అంశాలపై ఏటూ తేల్చుకోలేక పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరొక్కసారి భేటీ అయి ఈ అంశాలపై చర్చించాలని సమావేశాన్ని వాయిదా వేశారు.
TG Highcourt: నాట్ టు అరెస్ట్.. పుష్ప నిర్మాతలకు హైకోర్టులో ఊరట
తిరిగి ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఇందులో ప్రధానంగా ఉద్యోగస్తులకు, ప్రజా ప్రతినిధులకు, ఐటీ పేయర్స్‌కు రైతు భరోసాపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్ పేయర్స్ విషయంలో సబ్ కమిటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్ సమావేశం లోపు రైతు భరోసాపై విధి విధానాలు ఖరారు చేసి అందజేస్తే.. సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి ఏ విధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే దానిపై నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతుల వేదికల ద్వారా సమావేశాలు పెట్టి గ్రామస్థాయి నుంచి రిపోర్టులను ప్రభుత్వానికి అందజేశారు అధికారులు. వాటి ఆధారంగా రైతు భరోసాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మొత్తానికి సంక్రాంతికి రైతుల ఖాతాలో ఎకరాకి రూ.7500 రైతు భరోసా డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇవి కూడా చదవండి...
ఏపీ క్యాబినెట్ భేటీ.. నిర్ణయాలు ఇవే..
నేటి బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే
Read Latest Telangana News And Telugu news