Kondagattu: అంజన్నకు 85 లక్షల విలువైన ఆభరణాలు

ABN, Publish Date - Feb 11 , 2025 | 04:56 AM

మహేశ్‌రెడ్డి వాటి ఏర్పాటుకు ముందుకు వచ్చారు. స్వామి వారికి 325గ్రాముల బంగారం తాపడంతో రాగి రేకుపై కిరీటం, రామరక్షతో పాటు 48.5కిలోల వెండితో గర్భాలయ ద్వారానికి కుడి, ఎడమ వైపు ద్వార బందనం, తొడుగులు తయారు చేయించి ఆలయ అధికారులు, అర్చకులకు అప్పగించారు.

Kondagattu: అంజన్నకు 85 లక్షల విలువైన ఆభరణాలు

మల్యాల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన ఏఎంఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ యజమాని, కొండగట్టు ఆంజనేయస్వామి భక్తుడు ఏ.మహేశ్‌రెడ్డి-రాధికరెడ్డి దంపతులు రూ.85లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను అందజేశారు. రెండేళ్ల క్రితం ఆలయంలో చోరీ జరిగిన సందర్భంలో స్వామి వారి మకరతోరణం, శఠగోపం, గర్భాలయ వెండి తొడుగులు అపహరణకు గురి అయ్యాయి. మహేశ్‌రెడ్డి వాటి ఏర్పాటుకు ముందుకు వచ్చారు. స్వామి వారికి 325గ్రాముల బంగారం తాపడంతో రాగి రేకుపై కిరీటం, రామరక్షతో పాటు 48.5కిలోల వెండితో గర్భాలయ ద్వారానికి కుడి, ఎడమ వైపు ద్వార బందనం, తొడుగులు తయారు చేయించి ఆలయ అధికారులు, అర్చకులకు అప్పగించారు.

Updated Date - Feb 11 , 2025 | 04:56 AM