Share News

సిరులు కురిపిస్తాయని సాగుచేస్తే

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:17 AM

సిరులు కురిపిస్తాయని సన్నాలు సాగుచేసిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. పంట చేతికి వచ్చా నా తాలు పోయి.. తూకాల్లేక అన్నదాత దిగాలు చెందుతున్నాడు.

సిరులు కురిపిస్తాయని సాగుచేస్తే
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న దొడ్డు రకం ఽధాన్యం

పంట చేతికి వచ్చినా దిగుబడి తగ్గిన సన్న రకం ధాన్యం

తాలు పోయి.. తూకాల్లేక దిగాలు

ఇదీ సాగర్‌ ఆయకట్టు అన్నదాత పరిస్థితి

మిర్యాలగూడ(వ్యవసాయం), ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): సిరులు కురిపిస్తాయని సన్నాలు సాగుచేసిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. పంట చేతికి వచ్చా నా తాలు పోయి.. తూకాల్లేక అన్నదాత దిగాలు చెందుతున్నాడు. సాగర్‌ ఆయకట్టులో ఇదీ రైతుల పరిస్థితి. సన్నాలకు తెగుళ్ల వ్యాప్తి అధికం కావడంతో పాటు అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక దిగుబడులు పడిపోయాయి. మార్కెట్లో మద్దతు ధర రాక రైతులు నష్టాలపాలయ్యా రు. సాగర్‌ ఆయకట్టులో దశాబ్ధాకాలంగా యాసంగి లో ఎంటీయూ -1010 వంటి దొడ్డు రకాలను రైతులు సాగు చేసేవారు. ఐదేళ్లుగా సన్నాలకు మార్కెట్లో డిమాండ్‌ ఉంది. మిల్లర్లు తేమ శాతంతో సంబంధం లేకుండా పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండడంతో వానాకాలంతో పాటు యాసంగిలోను 80శాతం మేర సన్నాలను(ప్రైవేట్‌ రకాలు) రైతులు సాగు చేస్తున్నారు. ప్రతిఏటా మద్దతుకు మించి ధర పొందిన రైతులు ఈ ఏడాది ధాన్యం ధరలేక రైతులు దిగాలు పడ్డారు. గత ఏడాది క్వింటాకు రూ.2300 నుంచి రూ.2700లు పలికిన ఽధాన్యానికి ప్రస్తుతం మద్దతు రూ.2320ల ధర దక్కడం లేదు. చింట్ల రకం సన్న ఽధాన్యానికి రూ.2200లు, హెచ్‌ఎమ్‌టీ వంటి రకాలకు రూ.2వేలకు మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. ఽసన్న రకాలకు ఇంత తక్కువ ధర పలకడం ఆయకట్టు చరిత్రలో ఇదే ప్రథ మం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక..

సాధారణంగా సన్న గింజ రకాలు వానాకాలం అనువైనవి. యాసంగిలో కొంత మేర చలి ఉండడం తో పాటు అధిక ఉష్ణోగ్రతలను ఇవి తట్టుకోలేవు. తెగుళ్ల వ్యాప్తితో పాటు గింజ కట్టు సరిగా ఉండదు. పొలం నిండుగా కనిపించినా తూకాలు రావు. ఎకరానికి 35బస్తాలు దిగుబడులు రావడం కష్టమని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. కోత మిషన్‌లో ట్యాంకులో పది బస్తాల ధాన్యానికి (బస్తాకు 70కిలోలు) నిండుతుంది. ఈ సన్న రకం ధాన్యంలో తాలు ఉండడంతో ఏడు బస్తాల ధాన్యానికి కోత మిషన్‌ ట్యాంకు నిండుతుంది.. ట్రాక్టర్‌ బోరెంలో పూర్తిస్థాయిగా నింపితే 80బస్తాల వరకు పడుతుంది. ప్రస్తుతం డిసెంబరు చివరి, జనవరి మాసంలో నాట్లు వేసిన వరి ఈ నెలలో కోతకు రావడంతో గింజ చాలా వరకు తాలు పోయిందని, బోరెంలో నిం డా పోసినా 65-70బస్తాలు రావడం లేదని రైతులు వాపోతున్నా రు. ధాన్యం ఇంకా ఆరితే తూకాలు చాలా తగ్గే అవకాశం ఉండడంతో మద్దతు ధర రాక పోయినా రైతు లు మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు మద్దతు ధర రూ.2350లతో పాటు రూ.500ల బోనస్‌ వస్తున్నా.. ధాన్యాన్ని 17 తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టాల్సి రావడంతో తప్పని పరిస్థితుల్లో మిల్లర్లు ఇచ్చిన ధరకే ధాన్యం విక్రయిస్తున్నామని రైతులు చెబుతున్నారు. దీంతో పంటసాగు గిట్టుబాటు కావడం లేదనే ఆందోళన అన్నదాతల్లో నెలకొంది.

దొడ్డు రకాలతో రైతులకు మేలు..

ఆయకట్టులో ఈ యాసంగిలో కేవలం 20శాతం మేర మాత్రమే దొడ్డు రకం వరిసాగు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 97శాతం మేర వరిదొడ్డు రకాలే ఉన్నాయి. వాటికి పూర్తిస్థాయిలో రైతులు మద్దతు ధర పొందుతున్నారు. ఈ రకాలు యాసంగికి అనుకూలమైనవి కావడంతో తక్కువ పెట్టుబడితో ఎకరానికి 45-50బస్తా వరకు పంట దిగుబడులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. తూకంతో పాటు గింజ నాణ్యతగా ఉండటంతో రైతులకు ప్రయోజనం చేకూరింది.. అందుకు భిన్నంగా సన్నాలు సాగు గిట్టుబాటు కాక రైతన్నకు నష్టం వాటిల్లింది. దొడ్డు రకాలు సాగు చేస్తే మంచి ఫలితాలు వచ్చేయని అటు ఇటు కావడం అంటే ఇదేనేమో అని రైతులు వాపోతున్నారు.

సన్నాలు తాలు పోతున్నాయి

ఐదెకరాల్లో చింట్లు రకం వరి సాగు చేశా. రెండు రోజుల క్రితం పంట కోశా. అధిక ఉష్ణోగ్రతలకు చాలా వరకు తాలు గింజ పోయింది. తూకాలు తగ్గా యి. ఎకరానికి 35బస్తాలు రావడం కష్టంగా మా రింది. ఽక్వింటాకు రూ2200 విక్రయించాను. సన్నాల సాగు గిట్టుబాటు కాలేదు. మరో ఆరు ఎకరాలలో దొడ్డు రకం సాగు చేశా. ఎకరానికి 45-50 బస్తాల వరకు దిగుబడులతో పాటు మంచి తూకాలు వస్తున్నాయి. ఈ రకాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాను.

- అనుముల శ్రీనివా్‌సరెడ్డి, రైతు, నల్లగొండ జిల్లా త్రిపురారం.

Updated Date - Apr 15 , 2025 | 12:17 AM