Jayalakshmi: ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:58 AM
అనారోగ్య సమస్యల కారణంగా తీవ్ర మనోవేదనతో ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని తమ కార్యాలయం సీజీవో టవర్స్ 8వ అంతస్తు నుంచి దూకి చనిపోయారు.

అనారోగ్య సమస్యలతో తీవ్ర మనోవేదనకు లోనై ఆఫీసులోని 8వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణం
కవాడిగూడ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): అనారోగ్య సమస్యల కారణంగా తీవ్ర మనోవేదనతో ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని తమ కార్యాలయం సీజీవో టవర్స్ 8వ అంతస్తు నుంచి దూకి చనిపోయారు. శనివారం గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గాంధీనగర్ సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఈసీఐఎల్‌లో నివాసం ఉంటున్న జయలక్ష్మి(52), రమేశ్ భార్యాభర్తలు.
వీరికి భావన అనే కూతురు ఉంది. జయలక్ష్మి కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో పాటు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం కార్యాలయానికి సెలవు అయినప్పటికీ ఆమె ఆఫీసుకు వచ్చారు. ఉదయం 11-12 గంటల సమయంలో సీజీవో టవర్స్ 8వ అంతస్తుకు వెళ్లి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. జయలక్ష్మి కూతురు భావన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.