Share News

Jagan: తల్లీచెల్లి మోసం చేశారు..

ABN , Publish Date - Apr 04 , 2025 | 04:27 AM

సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ షేర్ల బదిలీపై తన తల్లి వైఎస్‌ విజయలక్ష్మి, చెల్లి వైఎస్‌ షర్మిల మోసగించారని మాజీ సీఎం జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.

Jagan: తల్లీచెల్లి మోసం చేశారు..

  • దొంగ పత్రాలు సృష్టించి సరస్వతీ పవర్‌ షేర్లు బదిలీ చేసుకున్నారు

  • వారిపై ప్రేమ, అభిమానాలు పోయాయి

  • ఇప్పుడు గిఫ్ట్‌ ఇవ్వాలని అనుకోవట్లేదు

  • ఎంవోయూ, గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చేసుకున్నాను

  • ఎన్సీఎల్టీలో జగన్‌ వాదనలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ (ఆంధ్రజ్యోతి): సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ షేర్ల బదిలీపై తన తల్లి వైఎస్‌ విజయలక్ష్మి, చెల్లి వైఎస్‌ షర్మిల మోసగించారని మాజీ సీఎం జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు తెలియకుండా షేర్ల బదిలీకి తప్పుడు తేదీలతో దొంగ పత్రాలు సృష్టించారన్నారు. తమకు తెలియకుండానే తమ పేరిట ఉన్న 51ు వాటా బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీ రద్దుచేసి తమ వాటా తమకే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కో రుతూ జగన్‌, భారతి, వారి కంపెనీ క్లాసిక్‌ రి యాల్టీ హైదరాబాద్‌లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్సీఎల్టీ)లో దాఖలు చేసిన పిటిషన్‌ను రాజీవ్‌ భరద్వాజ్‌, సంజయ్‌ పూరితో కూడిన బెంచ్‌ విచారణ చేపట్టింది. ‘మా మధ్య సంబంధాలు బాగున్నప్పుడు ప్రేమ, అభిమానంతో సరస్వతీ పవర్‌లో షేర్లు బహుమతిగా ఇచ్చేందుకు ఎంవోయూ జరిగింది. సదరు ఎంవోయూ షరతులతో కూడిన ఒక ఒప్పందం. అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈడీ ఆస్తులను అటాచ్‌ చేసిం ది. సదరు అటాచ్‌మెంట్లపై హైకోర్టు స్టేటస్‌ కో (యథాతథ స్థితి) విధించింది.


సదరు ఆస్తులన్నీ విడుదలయ్యాక షేర్లు గిఫ్ట్‌గా ఇస్తానని ఒప్పం దం చేసుకున్న మాట వాస్తవం. ఒప్పందంపై సంతకం పెట్టలేదని నేను వాదించడం లేదు. సంతకం పెట్టాను. కానీ ఒప్పంద షరతులకు వి రుద్ధంగా తల్లి, చెల్లి వ్యవహరించారు. షేర్ల ప త్రాలు, షేర్ల బదిలీ పత్రాలు అన్నీ ఇప్పటికీ నా వద్దే ఉన్నాయి. భౌతికంగా గిఫ్ట్‌ ఇచ్చేవారి నుంచి తీసుకునే వారికి అది చేరినప్పుడు చట్ట ప్రకారం గిఫ్ట్‌ డీడ్‌ పూర్తవుతుంది. అసలు నేను గిఫ్ట్‌ ఇవ్వలేదు. బహుమతి నావద్దే ఉంది. ప్రస్తుతం గిఫ్ట్‌ ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. నా తల్లి విజయలక్ష్మి పేరిట సరస్వతీ పవర్‌ షేర్ల బదిలీ అక్రమం. నా తల్లి చెల్లి పట్ల పక్షపాతం చూపిస్తోంది. నా తల్లి, చెల్లిపై ప్రేమ, అభిమానాలు పోయాయి. అందుకే షరతులతో కూడిన ఎంవోయూను, గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చేసుకున్నా. ఈ పరిస్థితుల్లో షేర్ల బది లీ ప్రశ్నే తలెత్తదు. నాకు తెలియకుండా సరస్వ తీ పవర్‌ బోర్డు బదిలీ తీర్మానం ఎలా ఆమోదిస్తుంది? షరతులు ఉల్లంఘించినందున వాటి ని రద్దు చేసుకుంటున్నాను’ అని జగన్‌ తరఫున నిరంజన్‌ రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

For More AP News and Telugu News

Updated Date - Apr 04 , 2025 | 04:27 AM