Hyderabad: మీరు బయట జ్యూస్ తాగుతున్నారా.. అయితే ఒక్కసారి..
ABN, Publish Date - Mar 29 , 2025 | 10:25 AM
మీరు బయట జ్యూస్ తాగుతున్నారా.. అయితే ఒక్కసారి ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. పాడైన పండ్లతో జ్యూస్ తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న విషయం హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
- పాడైన పండ్లతో జ్యూస్..
హైదరాబాద్ సిటీ: పాడైన పండ్లు, నాణ్యతా రహిత ఐస్, కాలం చెల్లిన పండ్ల సిర్‌పలు, బొద్దింకలు, ఎలుకల సంచారం.. ఇదీ ఐటీ కారిడార్‌లోని పలు జ్యూస్ సెంటర్లలో పరిస్థితి. గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ వద్ద మూడు జ్యూస్ విక్రయ కేంద్రాలను కమిషనర్ ఫుడ్ సేఫ్టీ(సీఎఫ్ఎస్) టాస్క్‌ఫోర్స్ బృందం పరిశీలించింది. డీఎల్‌ఎఫ్ గేట్ నంబర్-2(DLF Gate No. 2) వద్ద గల మిలాన్ జ్యూస్ సెంటర్‌లో పాడైన యాపిల్స్, బ్లాక్ గ్రేప్స్, మామిడిపండ్లు, తొక్క తీసిన దానిమ్మ గింజలు గుర్తించారు.
ఈ వార్తను కూడా చదవండి: New software: ఆన్‌లైన్ మోసాలకు ఇక అడ్డుకట్ట..
బిస్మి మ్యాగి అండ్ జ్యూస్ సెంటర్‌లో పాడైన దానిమ్మ పండ్లు, బొద్దింకలు, ఎలుకల సంచారాన్ని గుర్తించారు. మూడు జ్యూస్ సెంటర్లలో అపరిశుభ్రంగా రిఫ్రిజిరేటర్లు(Refrigerators), ఆహార పదార్థాల నిల్వలో ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు తేల్చారు. నిర్వాహకులకు నోటీసులు అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హైడ్రా, మూసీ పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్ గద్దలు
కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..
ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు..
పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం.. డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..
Read Latest Telangana News and National News
Updated Date - Mar 29 , 2025 | 10:37 AM