Share News

ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావి అంబేద్కర్‌

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:47 PM

ప్రపంచం గర్వించదగ్గ గొప్పుమేధావి బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ అని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. అంబేద్కర్‌ జయంతి సం దర్భంగా సోమవారం బస్టాండ్‌ చౌరస్తా వద్ద గల అంబే ద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామిక దేశమైన దేశానికి రాజ్యాంగాన్ని అందించారని, దేశాభివృద్ధికి అంబేడ్కర్‌ దిశానిర్ధేశం చేశారని తెలిపారు.

ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావి అంబేద్కర్‌

పెద్దపల్లి కల్చరల్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రపంచం గర్వించదగ్గ గొప్పుమేధావి బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ అని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. అంబేద్కర్‌ జయంతి సం దర్భంగా సోమవారం బస్టాండ్‌ చౌరస్తా వద్ద గల అంబే ద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామిక దేశమైన దేశానికి రాజ్యాంగాన్ని అందించారని, దేశాభివృద్ధికి అంబేడ్కర్‌ దిశానిర్ధేశం చేశారని తెలిపారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్పమేధావి అంబేడ్కర్‌ అని, ఆయన చూపిన మార్గంలో నడిచి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ప్రతీ ఒక్కరు కృషిచేయాలని తెలిపారు. అంబేడ్కర్‌ చిన్నతనం నుండి అనేక వివక్షలను, అవమానాలకు ఎదుర్కొని పట్టుదలతో ఉన్నత విద్య అభ్య సించి దేశానికి మార్గదర్శకం చేశారని తెలిపారు. అంబే డ్కర్‌ ఏ వర్గానికి చెందినవారు కాదని, ప్రతివర్గంలో జరు గుతున్న అన్యాయాలపై ప్రశ్నించారని, సమాజంలో ఉన్న అసమానతలు తగ్గించేందకు ఆయన కృషిచేశారని పేర్కొ న్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించుకుం టూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. అధికారులు, సిబ్బంది, సంఘాల ప్రతినిఽ దులు, అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. జిల్లా షెడ్యూల్‌ కులాల ఇన్‌చార్జి అభివృద్ధి అధికారి వినోద్‌కు మార్‌, అధికారులు, ఉద్యోగులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌

అంబేడ్కర్‌ ఆశయాల సాధనకు మనమంతా కృషి చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని 102దేశాల వ్యాప్తంగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరు గుతున్నాయని, ఇంతగొప్ప జయంతి వేడుకలు జరుపుకుం టున్న మహానీయుడు అంబేడ్కర్‌ మాత్రమేనన్నారు. ప్రతి ఊరు, వాడల్లో జయంతి కార్యక్రమాలు జరుగుతున్నా యన్నారు. అంబేడ్కర్‌ దూరదృష్టితో అనేక సమస్యలను పరిష్కారం చూపు తూ రాజ్యాంగాన్ని రచించారన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు మనమంతా కలిసి పనిచేయాలన్నారు. జైభీమ్‌, జైసంవిధాన్‌ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. అంబేడ్కర్‌ చిన్నతనం నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్నారని, సమా జంలో ఉన్న కులవివక్ష, హెచ్చుత గ్గులు తొలగించాలనే ఆశయంతో ఆయన పోరాడారన్నారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. బస్టాండ్‌ చౌర స్తాను అంబేడ్కర్‌ కూడలిగా నామకరణ చేయాలని ఎమ్మె ల్యే ప్రతిపాదించారు. దసరా నాటికి బస్సు డిపో పనులు పూర్తిచేసి ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు, అధికారులు మాట్లాడారు. కులాంతర వివాహం చేసుకున్న 9జంటలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. గ్రంథాలయ చైర్మన్‌ అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ స్వరూప, అధికారులు, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు శంకర్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 11:47 PM