Share News

దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యం

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:03 AM

దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడమే బీజేపీ ముఖ్య ఉద్దేశ్యమని మాజీ ఎమ్మెల్యే గు జ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జెండాను ఎగురవేశారు.

దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యం

పెద్దపల్లి రూరల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడమే బీజేపీ ముఖ్య ఉద్దేశ్యమని మాజీ ఎమ్మెల్యే గు జ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జెండాను ఎగురవేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 1980 ఏప్రిల్‌ 6న బీజేపీ ఆవిర్భావించినప్పటి నుంచి ఒడిదొడుకులను అధిగమించుకుంటూ పుంజుకుందని తెలిపారు. ప్రధాని మోదీ మొండి ధైర్యంతో జమ్మూకశ్మీర్‌లో 37 ఆర్టికల్‌ను రద్దు చేశారన్నారు. కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రెండు తడులు సాగునీరు ఇవ్వాలి

ఎస్సారెస్పి డి-83, 86 కెనాల్‌ ద్వారా ఆధార పడి ఉన్న రైతులకు రెండు తడులు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌ అన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిమ్మనపల్లిలో దుగ్యాల ప్రదీప్‌కు మార్‌ జెండాను ఎగురవేశారు. ప్రదీప్‌ మాట్లా డుతూ నీరు అందకుంటే పంటలు పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. రైతులకు మరొక తడి సాగునీటిని విడుదల చేయాలని వారు పేర్కొన్నారు. రాజేశ్వర్‌రావు మేకల శ్రీని వాస్‌, మండల అధ్యక్షులు వేల్పుల రమేష్‌, పోల్సాని సంపత్‌రావు, ఈర్ల శంకర్‌, ఒల్లే తిరుప తి, రాజం మహంత కృష్ణ, ఓదెల మండల అధ్య క్షుడు శ్రీనివాస్‌, మహేందర్‌, పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:03 AM