మహిళా సంఘాలకు ఎరువులు, విత్తనాల దుకాణాలు
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:43 AM
మహిళ సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాల దుకాణాలు నిర్వహించడానికి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అదేశించా రు.

సిరిసిల్ల, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): మహిళ సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాల దుకాణాలు నిర్వహించడానికి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అదేశించా రు. మంగళవారం కలెక్టరేట్‌లో మహిళ సంఘాల ద్వారా, ఎరు వులు, విత్తనాలు, డీలర్‌షిప్ దుకాణాల ఏర్పాటుపై అధికారుల తో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని మహిళ సంఘాల్లో అర్హులైన వారిని గుర్తించి ఎరువులు, విత్తనాల దుకాణాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎరువులు, విత్తనాల దుకాణాలు నడిపేవారికి బీఎస్సీ(అగ్రికల్చ ర్) డిగ్రీ, లేదా డిప్లొమా, సొంత గోడౌన్, అద్దెకు తీసుకున్న గో డౌన్‌లు, ఎరువులు, విత్తనాల లైసెన్స్ సర్టిఫికెట్ అవసరం ఉం టుందన్నారు. మహిళా సంఘాలకు ఎరువులు, విత్తనాల డీలర్ షిప్ దుకాణాల ఏర్పాటుకు అవసరమైన లైసెన్స్ కల్పించేందుకు చర్య లు తీసుకోవాలని అన్నారు. మహిళ సంఘం పూర్తి వివరాలు తీసుకొని వ్యవసాయ అధికారిని సంప్రదించాలన్నారు. జిల్లాలోని ప్రతి మండ లంలో రెండు ఎరువులు, విత్తనాల దుకాణాలను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటయ్యేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అవసరమై న గోదాంతో కూడిన భవనాలు అద్దెకు తీసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల్లో అర్హత ఉన్న వారు ముందుకు వస్తే అవసరమైన లైసెన్స్‌లు, సర్టిఫికెట్‌లు వ్యవసాయ శాఖ అందిస్తుందన్నారు. రాబోయే పంట సీజన్‌ల ముందు ఈ షాప్‌ల ఏర్పాటుచేస్తే ఎరువుల కేటాయిం పు, ఎరువుల విక్రయం గురించి శిక్షణ అందిస్తామన్నారు. ఈ సమా వేశంలో డీఆర్‌డీవో శేషాద్రి, డీఎవో అప్జల్ భేగం, అదనపు డీఆర్‌డీవో శ్రీనివాస్, మండలాల ఎపీఎంలు పాల్గొన్నారు.