రౌడీషీటర్లలో మార్పు రాకపోతే పీడీ యాక్టు
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:20 PM
రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకోకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపా లకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని డీసీపీ కరుణాకర్ హెచ్చరించారు. గురువారం వన్ టౌన్‌లో రౌడీషీటర్లకు ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్ల నేర చరిత్ర, వారిపై ఉన్న కేసులు, ప్రస్తుత జీవన విధానంపై అడిగి తెలుసుకున్నారు.

కోల్‌సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకోకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపా లకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని డీసీపీ కరుణాకర్ హెచ్చరించారు. గురువారం వన్ టౌన్‌లో రౌడీషీటర్లకు ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్ల నేర చరిత్ర, వారిపై ఉన్న కేసులు, ప్రస్తుత జీవన విధానంపై అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్లు ఎలాంటి గొడవల్లో తలదూ ర్చినా, బెదిరించినా ఉపేక్షించేది లేదని, శాశ్వతంగా జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. కొందరు చెప్పిన మాటలు విని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జైలు పాలు కాక తప్పదన్నారు. ఎవరు నేరాలకు పాల్ప డినా తప్పించుకోలేరని, సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తుతో ప్రతి నేరస్థుడు చట్టానికి దొరుకు తున్నాడన్నారు. ప్రతీ రౌడీషీటర్‌పై ప్రత్యేక నిఘా పెట్టా మని, ఎవరు చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడినా ఉక్కు పాదం మోపుతామన్నారు. హత్యకేసుల్లో దోషులకు జీవిత ఖైదు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొం దరు గంజాయి అమ్మకాలు, సరఫరాలో పాలుపంచుకుం టున్నారనే సమాచారం ఉందని, వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నేర ప్రవృత్తి మార్చుకోవడానికి ఒక్క అవకాశం ఇస్తున్నామని, పదేళ్లుగా నేర ప్రవృత్తి లేని రౌడీషీటర్లపై ఉన్న షీట్లను తొలగిస్తామన్నారు. ఏసీపీ మడత రమేష్, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి, ఇన్‌స్పెక్టర్-2 రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.
టూటూన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ
యైుటింక్లయిన్‌కాలనీ, (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను డీసీపీ కరుణాకర్ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలను తెలు సుకున్నారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులు, నేరాల తీరు, రౌడీ షీటర్ల వివరాలను తెలుసుకున్నారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి, వారికి భరోసా కల్పించేలా మెలగాలని సూచించారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితుల ప్రస్తుత స్థితిగతులను సీఐని అడిగి తెలుసుకున్నారు. 100కు వచ్చే కాల్స్‌పై వేగంగా స్పందించాలని సూచించారు.