గరీబ్ కళ్యాణ్ అన్నయోజనతోనే సన్నబియ్యం
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:59 PM
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేదవాడికి 5 కిలోల సన్నబియ్యం అందజేస్తుందని బీజేపీ రామగుండం ఇంచార్జీ కందుల సంధ్యారాణి అన్నారు. ఆదివారం గోదావరిఖనిలోని పలు రేషన్ షాపులను బీజేపీ నాయకులు సందర్శించి రేషన్ షాపు ఎదుట మోదీ చిత్రపటం పెఆ్టలని డీలర్లను డిమాండ్ చేశారు.

కోల్‌సిటీటౌన్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేదవాడికి 5 కిలోల సన్నబియ్యం అందజేస్తుందని బీజేపీ రామగుండం ఇంచార్జీ కందుల సంధ్యారాణి అన్నారు. ఆదివారం గోదావరిఖనిలోని పలు రేషన్ షాపులను బీజేపీ నాయకులు సందర్శించి రేషన్ షాపు ఎదుట మోదీ చిత్రపటం పెఆ్టలని డీలర్లను డిమాండ్ చేశారు. చిత్రపటాన్ని పెట్టే వరకు షాపుల నుంచి వెనుదిరిగి వెళ్ళేది లేదని పట్టుపట్టారు.
రేషన్‌షాపు ఎదుట మోదీ చిత్రపటాన్ని, పథకం వివరాలను తెలియ జేసేలా బోర్డులు పెట్టారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అంది స్తున్న 5కిలోల ఉచిత బియ్యానికి కేవలం ఒక కిలో బియ్యాన్ని అందజేస్తూ మొత్తం రాష్ట్ర ప్రభు త్వమే అందజేస్తుందని అబద్దపు ప్రచారం చేస్తుందన్నారు. సొమ్మొకరిది సొకొకరిది అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం విధానం ఉందని ఎద్దెవా చేశారు. నాయకులు కోమ ళ్ళ మహేష్, కొండపర్తి సంజీవ్, విశ్వాస్, ఆకాశ్, రంజిత్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.