పీజీ కళాశాలలో క్విజ్, ముగ్గుల పోటీలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:19 AM
మహానీయుల జయం తి ఉత్సవాలలో భాగంగా గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కళా శాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు క్విజ్, రంగోలి పోటీలు నిర్వహించారు.

కోల్‌సిటీటౌన్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): మహానీయుల జయం తి ఉత్సవాలలో భాగంగా గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కళా శాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు క్విజ్, రంగోలి పోటీలు నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రమా కాంత్, శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ హాజరై మాట్లాడారు. దేశానికి మహానీ యులు అందించిన సేవలను, వారి మార్గనిర్దేశాలను కొనియా డారు. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అఽధ్యాప కులు అజయ్‌కుమార్, యాదయ్య, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసాద్, పాల్గొన్నారు.