Share News

నేరాల నియంత్రణకు పకడ్బందీగా వ్యవహరించాలి

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:55 AM

నేరాల నియంత్రణకు పకడ్బందీగా వ్యవహరించాలని ఎస్పీ మహేశ్‌ బి. గీతే అన్నారు.

నేరాల నియంత్రణకు పకడ్బందీగా వ్యవహరించాలి

సిరిసిల్ల క్రైం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణకు పకడ్బందీగా వ్యవహరించాలని ఎస్పీ మహేశ్‌ బి. గీతే అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సిరిసిల్ల పోలీస్‌ సబ్‌ డివిజన్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయల్‌ 100పై తక్షణమే స్పందిస్తూ సమస్యలు పరిష్కరించాలన్నారు. పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్క రిస్తూ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పెండింగ్‌ కేసుల్లో ప్లాన్‌ ఆఫ్‌ యాక్ష న్‌ ప్రకారం ఇన్వెస్టిగేషన్‌ చేసి కేసులు ఛేదించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తులో మరింత నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు. పెండింగ్‌ ఉన్న కేసులలో త్వరగా ఇన్వెస్టిగేషన్‌ పూర్తిచేసి నిందితులను అరెస్ట్‌చేసి చార్జిషీట్‌ దాఖ లు చేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. నేరాల ఛేదనలో సాంకే తిక పరిజ్ఞానం వినియోగించాలన్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో గంజాయి, పేకాట, పీడీఎస్‌ రైస్‌, గుడుంబా, ఇతర చట్ట వ్యతిరేకమైన నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి కేసులు నమోదుచేయాలన్నారు. ఇతర చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిం చాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ప్రతి రోజు డ్రంకెన్‌ డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు. ఓవర్‌ స్పీడ్‌, ట్రిపుల్‌ డ్రైవింగ్‌, మైనర్‌లు వాహనాలు నడపడం లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావే శంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్‌, సదన్‌కుమార్‌, మధుకర్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 12:55 AM