Ponnam Prabhakar: అసహనానికి పరాకాష్ట.. కేటీఆర్
ABN , Publish Date - Jan 26 , 2025 | 06:51 PM
Ponnam Prabhakar: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ అసహనానికి పరాకాష్టగా మారారని ఆయన అభివర్ణించారు.

హైదరాబాద్, జనవరి 26: కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరు కారణంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జీర్ణం కావడం లేదని.. ఈ నేపథ్యంలో ఆయనకు ఈనో (ENO) ప్యాకెట్లు పంపిస్తానని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిన అనంతరం రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అసహనానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పరాకాష్టగా మారారన్నారు. పథకాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంటే.. అవి ఎందుకు అని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నించారని గుర్తు చేశారు. ఏ ఊరికి పోదామో నువ్వే డిసైడ్ చేయి.. ఒక్క లబ్దిదారుడికి అన్యాయం జరిగినా అడగాలంటూ కేటీఆర్‌కు మంత్రి పొన్నం సవాల్ విసిరారు.
ఇక రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలు ఉండాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడంపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఇందిరమ్మ పేరు పెడితే నగదు ఇవ్వారా? ఎలా ఇవ్వరో మేము చూస్తామన్నారు.
కేంద్ర మంత్రి బండికి వార్నింగ్..
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి అవహేళగా మాట్లాడితే.. ఊరుకునేది లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇందిరాగాంధీని గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయ్.. అపర కాళీకా మాతతో పోల్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 10 నెలల కాలంలో.. జీఏస్టీ రూపంలో రూ. 37 వేల కోట్లు కేంద్రం వసూల్ చేసిందని.. మరి అందులో తెలంగాణకు కేంద్రం ఎంత ఇచ్చిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు.
Also Read: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా..
వీళ్లేమైనా దేశం కోసం ..
దీన్ దయాళ్ అంత్యోదయ, దీన్ దయాళ్ గృహ జ్యోతి వంటి పేర్లు.. ప్రభుత్వ పథకాలకు ఎందుకు పెట్టారని బీజేపీ నేతలను సూటిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. వీళ్లేమైనా దేశం కోసం ప్రాణ త్యాగం చేశారా? అని సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని.. ఒక్క రూపాయి అయినా.. కేంద్రం నుంచి అదనంగా తీసుకు వచ్చారా? అని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు పొన్నం ప్రభాకర్ చురకలంటించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఇంకొక్క మాటన్న భారతీయులు ఊరుకోరని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Also Read: అరిటాకులో భోజనం చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
Also Read : పద్మ పురస్కారంపై స్పందించిన బాలయ్య బాబు
ఇంతకీ కేంద్ర మంత్రి ఏమన్నారంటే..?
కరీంనగర్ నగర మేయర్ సంతోష్ రావుతోపాటు పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వారంతా బీజేపీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
Also Read: కోట్లు ఖర్చు పెట్టి.. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన కేసీఆర్
Also Read: న్యూఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
అలాగే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని.. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వా్న్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. జనవరి 26వ తేదీన నుంచి ప్రభుత్వం మంజూరు చేసే కొత్త రేషన్ కార్డులపై సీఎంతోపాటు ప్రధాని మోదీ ఫొటో కూడా పెట్టాల్సిందేనని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పైవిధంగా స్పందించారు.
For Telangana News And Telugu News