బీసీ గణనతో దేశం తెలంగాణ వైపు చూస్తుంది
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:38 PM
రాష్ట్రంలో బీసీ గణన చేసి 42శాతం విద్య,ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్లకు తీర్మానం చేసిన తెలంగాణ వైపు యావత్ దేశం చూస్తుందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గోదావరిఖని, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ గణన చేసి 42శాతం విద్య,ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్లకు తీర్మానం చేసిన తెలంగాణ వైపు యావత్ దేశం చూస్తుందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్‌సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటల్లోనే అమలు చేసా ్తమని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్గీకరణ జరిపారన్నారు. బీసీలపై కల్లబొల్లి మాటలు చెప్పే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు వారికి చేసిం దేమి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయాలని నిర్ణయిం చిందని, 1.75లక్షల మందితో రెండు సార్లు సర్వే చేయించిందన్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతో కూడిన కమిటీ బీసీ రిజర్వేషన్ పెంచేందుకు సిఫార్సు చేసిందన్నారు. రూ.8.5లక్షల కోట్ల అప్పు ఉన్నా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలపై ముందుకు పోతుందన్నారు. కేంద్రం సెక్షన్ 9 కింద దీన్ని ఆమోదిం చాల్సి ఉందన్నారు. అసెంబ్లీలో మద్దతు ఇచ్చినట్టు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఢిల్లీకి రాకుండా వంచన చేశాయన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో 3వేలమందితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష చేస్తే 80మంది ఎంపీలు హాజరై మద్దతు ఇచ్చారన్నారు. బీసీనని చెప్పుకునే ప్రధాని మోదీ బీసీలను వంచిస్తున్నా డన్నారు. బీసీ రిజర్వేషన్ పెంపునకు దేశ వ్యాప్తంగా బీసీలు ఉద్యమిం చాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, నాయకులు మహంకాళి స్వామి, దీటి బాలరాజు, పెద్దెల్లి ప్రకాష్, మారె ల్లి రాజిరెడ్డి, పెద్దెల్లి తేజస్విని, గట్ల రమేష్, ముస్తాఫా పాల్గొన్నారు.