Share News

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:35 PM

ప్రయాణికులకు మెరుగైన సౌక ర్యాల కల్పనే రైల్వే సంస్థ ప్రధాన లక్ష్యమని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అన్నారు. శుక్రవారం రామగుండం రైల్వే స్టేషన్‌ను సందర్శించి మాట్లాడారు. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు లో వచ్చిన జీఎంకు స్థానిక రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు.

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం

అంతర్గాం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులకు మెరుగైన సౌక ర్యాల కల్పనే రైల్వే సంస్థ ప్రధాన లక్ష్యమని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అన్నారు. శుక్రవారం రామగుండం రైల్వే స్టేషన్‌ను సందర్శించి మాట్లాడారు. సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు లో వచ్చిన జీఎంకు స్థానిక రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు. అమృత్‌ భారత్‌లో భాగంగా రూ.26కోట్లతో చేపట్టిన రైల్వేస్టేషన్‌ ఆధుని కీకరణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్‌ ఎదుట ఏర్పాటు చేసిన పార్కింగ్‌, ప్రయాణికులు వేచి ఉండే గదులు, ఎస్కాలెటర్‌, ఫ్లాట్‌ ఫాంలు పరిశీలించారు.

సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయా లని అధికారులను ఆదేశించారు. కార్మిక సమస్యలు విన్నవించిన మ జ్దూర్‌ యూనియన్‌ సంఘ్‌ నాయకులు జీఎంను సన్మానించారు. డీఆర్‌ ఎం భరతేష్‌ కుమార్‌ జైన్‌, ఏరియా ఆఫీసర్‌ రజినేష్‌ కుమార్‌ మీనా, ఏఈఎన్‌ బీఎంకే గుప్తా, కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్తిక్‌, స్టేషన్‌ మాస్టర్‌ మీనా, ఆర్‌పీఎఫ్‌ సీఐ బుర్ర సురేష్‌గౌడ్‌, జీఆర్‌పీ ఎస్‌ఐ మహేందర్‌, యూనియన్‌ నాయకులు యాదగిరి స్వామి, వీరన్న, రాథోడ్‌ ఆనంద్‌, విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:35 PM