పేదవారు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష
ABN, Publish Date - Apr 05 , 2025 | 12:03 AM
రాష్ట్రంలో పేదవారు సంతోషంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికి మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. శివకిరణ్ గార్డెన్స్‌లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.

మంథని, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదవారు సంతోషంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికి మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. శివకిరణ్ గార్డెన్స్‌లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను సరి చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల కృషి మేరకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వం ఒక్కొక్కరి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. పేదవారు కూడ సన్న బియ్యం తినాలనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు నడుస్తున్నామన్నారు. ఈపథకం ఆమలుతో రాష్ట్రానికి 3నుంచి 4 వేల కోట్ల అదనంగా ఆర్థికం భారం పడుతున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. పేదవారికి సన్న బియ్యం అందించాలే ఆలోచన చేసి సన్నరకం వడ్లకు రూ. 5 వందల బోనస్ ఇచ్చామన్నారు. కాళేశ్వరం లేకున్న రికార్డు స్థాయిలో ధాన్యం పెరిగిందన్నారు. బోనస్ రూపంలో రూ. 2 వేల కోట్లు రైతులకు ఇచ్చామన్నారు. రేషన్ డీలర్ల సమస్యలపై సానుకులంగా ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొంటిగా అమలు చేస్తున్నామన్నారు. 15 రోజుల్లో నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసంలో నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఆర్డీవో సురేష్, కాంగ్రెస్ నేతలు కొత్త శ్రీనివాస్, పెండ్రు రమ-సురేష్‌రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్, శశిభూషన్‌కాచే, ఐలి ప్రసాద్,ఇనుగంటి భాస్కర్‌రావు, చొప్పరి సదానందం, మంథని సురేష్, గుండా రాజులు పాల్గొన్నారు.
Updated Date - Apr 05 , 2025 | 12:03 AM