Share News

సమాచార వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోవాలి

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:44 AM

గ్రామాల్లో పోలీస్‌ అధి కారులు, సిబ్బంది పర్యటిస్తూ సమాచార వ్యవస్థను మెరుగుపర్చుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బి గితే అన్నారు.

సమాచార వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోవాలి

గంభీరావుపేట/ముస్తాబాద్‌ ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పోలీస్‌ అధి కారులు, సిబ్బంది పర్యటిస్తూ సమాచార వ్యవస్థను మెరుగుపర్చుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బి గితే అన్నారు. గంభీరావుపేట, ముస్తాబాద్‌ పోలీస్‌స్టేషన్లను మంగళవారం ఆయన తనిఖీచేశారు. పోలీస్‌స్టేషన్ల ఆవరణలో 5ఎస్‌ అమలుతీ రు, సిబ్బంది వివరాలు అడిగితెలుసుకున్నారు. రికార్డురూం, రైటర్‌రూం తదితర అన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులు, నమోదు అవుతున్న కేసుల వివరాలు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసు కుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ఎస్పీ రివ్యూ చేశారు. అనంతరం ఎస్పీ పలు సూచనలు చేశారు.

ఎగువ మానేరును సందర్శించిన ఎస్పీ..

గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయాన్ని ఎస్పీ మహే ష్‌ బి గితే సందర్శించారు. ఎగువ మానేరు విస్ర్తీర్ణం, ఆయకుట్టు, నీటి సామర్థం, ప్రస్తుత నీటి నిలువ తదితర అంశాలను తెలుసుకున్నారు. వెంట డీఎస్పీ చంద్ర శేఖర్‌రెడ్డి, సీఐలు శ్రీనివాస్‌, మొగిలి, స్థానిక ఎస్‌ఐ ప్రేమానందం ఉన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:44 AM