ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ప్రధాని

ABN, Publish Date - Apr 12 , 2025 | 12:39 AM

ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రపంచంలోనే అగ్రదేశాలతో పోటీపడుతూ ముందుకు నడిపిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో పెద్దపల్లి మున్సి పాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు.

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రపంచంలోనే అగ్రదేశాలతో పోటీపడుతూ ముందుకు నడిపిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో పెద్దపల్లి మున్సి పాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో ప్రపంచ దేశాలకు చిన్న చూపు ఉం డేదని, ఇప్పుడు నరేంద్ర మోదీ పాలనలో మన దేశంతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయన్నారు. మోదీ పరిపాలన విధానం, ప్రవేశపెట్టిన పథకాల వల్ల అన్ని వర్గాలకు సమ భాగంగా అందుతున్నాయని వివరించారు. కార్యకర్తలు అందరూ కేంద్ర ప్రభు త్వం కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో రాబోయే ఎన్నికలలో అన్ని వార్డుల్లో బీజేపీ కౌన్సిలర్లు గెలిచే విధంగా ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగా చక్రధర్‌ రెడ్డి, ఠాకూరు రాంసింగ్‌, అల్లంకి ప్రకాష్‌, మౌటం నర్సింగ్‌, శివంగారి సతీష్‌, బెజ్జంకి దిలీప్‌ కుమార్‌, పర్శ సమ్మయ్య వెల్లంపల్లి శ్రీనివాస్‌ తుడి రవి, మంతెన కృష్ణ, గణవేన రాజేందర్‌, మోర మనోహర్‌, పాల్గొన్నారు

Updated Date - Apr 12 , 2025 | 12:39 AM