Share News

సహకార సంఘాలను బలోపేతం చేస్తాం

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:58 PM

సహకార సంఘాలను బలోపేతం దిశగా అధికారులు పాలకవర్గాలు సమిష్టి కృషితో పనిచేయాలని డీసీవో శ్రీమాల అన్నారు. శుక్రవారం పీఏసీఎస్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సహకార సంవత్సరం పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీలో పాల్గొ న్నారు.

సహకార సంఘాలను బలోపేతం చేస్తాం

ఎలిగేడు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాలను బలోపేతం దిశగా అధికారులు పాలకవర్గాలు సమిష్టి కృషితో పనిచేయాలని డీసీవో శ్రీమాల అన్నారు. శుక్రవారం పీఏసీఎస్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సహకార సంవత్సరం పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీలో పాల్గొ న్నారు. సహకార బ్యాంకులు అంటే భయపడేవారని, నేడు రైతులు నిర్భయంగా రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు.

రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సంఘాలను బలోపేతం చేస్తున్నామన్నారు. పీఎసీఎస్‌ చైర్మన్‌ గోపు విజయభాస్కర్‌రెడ్డి, అసిస్టెంట్‌ రిజిస్టార్‌ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు సుధాకర్‌రెడ్డి, తిరుపతిగౌడ్‌, వెంకన్న, కనుకయ్య, సీఈవో విక్రమ్‌, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 11:58 PM