Share News

భూభారతి చట్టంపై విస్తృత ప్రచారం కల్పించాలి

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:32 PM

భూ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి ఆర్వోఆర్‌ చట్టంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో భూ భారతి చట్టం అమలుపై అదనపు కలెక్టర్‌ డి వేణు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

భూభారతి చట్టంపై విస్తృత ప్రచారం కల్పించాలి

పెద్దపల్లి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి ఆర్వోఆర్‌ చట్టంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో భూ భారతి చట్టం అమలుపై అదనపు కలెక్టర్‌ డి వేణు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భూభారతి చట్టంపై తహసీ ల్దార్లు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్నారు. చట్టంలో రెండంచెల అప్పీల్‌ వ్యవస్థ ఉందన్నారు. ఇకపై రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ చేసే సమయం లో సర్వే మ్యాప్‌ తప్పనిసరి అవుతుందన్నారు. ఈనెల 17 నుంచి 30 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, దీనికి సంబంధించిన షెడ్యూల్‌ తయారు చేసుకోవాలన్నారు. రోజు కనీసం రెండు చోట్ల అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూముల ఫెన్సిం గ్‌, మార్కింగ్‌ ప్రక్రియను తహసీల్దార్‌లు పూర్తి చేయాల న్నారు. పెద్దపల్లి, మంథని ఆర్‌డీఓలు బి.గంగయ్య, సురేష్‌, తహసీల్దార్‌లు, పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 11:32 PM