ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

K. Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయాలి

ABN, Publish Date - Jan 04 , 2025 | 04:03 AM

‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలి. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాలి.

  • బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు పెట్టాలి

  • బీఆర్‌ఎస్‌ పాలనలోనే బీసీల అభివృద్ధి: ఎమ్మెల్సీ కవిత

కవాడిగూడ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలి. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాలి. లేనిపక్షంలో తెలంగాణ జాగృతి, బీసీ కులాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.


సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని బీసీల డిమాండ్ల సాధన కోసం తెలంగాణ జాగృతి, వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద బీసీ మహాసభ నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీలు అడుగడుగునా బీసీలను మోసం చేశాయని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలతోనే బీసీలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో బీసీల సంక్షేమం, అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్దమని ఆమె చెప్పారు.

Updated Date - Jan 04 , 2025 | 04:03 AM