Share News

KCR: ఎవుసంపై కేసీఆర్‌ నజర్‌

ABN , Publish Date - Jan 25 , 2025 | 05:43 AM

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పూర్తిస్థాయిలో ఎవుసంపై దృష్టిపెట్టారు. గతంలో విత్తన వరి సాగు చేసిన ఆయన ఇప్పుడు వెదురుపై ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారు.

KCR: ఎవుసంపై కేసీఆర్‌ నజర్‌

  • ఫాంహౌ్‌సలో 150 ఎకరాల్లో వెదురు సాగుకు ప్రణాళిక

  • ఏడాది నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికే పరిమితం

గజ్వేల్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పూర్తిస్థాయిలో ఎవుసంపై దృష్టిపెట్టారు. గతంలో విత్తన వరి సాగు చేసిన ఆయన ఇప్పుడు వెదురుపై ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారు. 2023 డిసెంబరులో ఎన్నికల ఫలితాల అనంతరం సొంత కారులో సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన కేసీఆర్‌ అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు. అడపాదడపా మాజీ మంత్రులు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలవడమే తప్ప.. బయటకు రావడం లేదు. 180 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ 30 ఎకరాల్లో వరి పండిస్తున్నారు.


150 ఎకరాల్లో వెదురు సాగుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం సలహాలు, సూచనలు అందించేందుకు.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్‌ తన వ్యక్తిగత కార్యదర్శి (పీఎ్‌స)గా వ్యవసాయాధికారిని ఎంచుకున్నారు. మర్కుక్‌ మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న తీగుళ్ల నాగేందర్‌రెడ్డి ఇటీవల కేసీఆర్‌ పీఎ్‌సగా నియమితులయ్యారు. వెదురు సాగులో మెలకువలు, చేపట్టాల్సిన చర్యలపై ఈయన దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. మొక్కలు నాటే ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు సమాచారం.

Updated Date - Jan 25 , 2025 | 05:43 AM