ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KIMS: బాలికకు కిమ్స్‌ వైద్యుల అరుదైన సర్జరీ

ABN, Publish Date - Jan 07 , 2025 | 04:11 AM

గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఓ పదిహేనేళ్ల బాలికకు కిమ్స్‌ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి తప్పించారు.

  • గుండె గదులకు రంధ్రం.. గుండె, ఊపిరితిత్తుల మధ్య కణతికి ఆపరేషన్‌

  • తప్పిన ప్రాణాపాయం.. 5 రోజుల్లో డిశ్చార్జి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఓ పదిహేనేళ్ల బాలికకు కిమ్స్‌ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కూలి పని చేసుకునే దంపతుల కుమార్తెకు పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు. ఇటీవల తీవ్ర ఆయాసంతో బాధపడుతున్న బాలికను కొండాపూర్‌లోని కిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. గుండె గదులకు రంధ్రంతో పాటు గుండె-ఊపిరితిత్తుల మధ్యలో కణతి ఏర్పడిందన్నారు.


కణితి అప్పటికే గుండెపై పొరను కప్పేయడంతోపాటు, కొంతవరకు ఊపిరితిత్తులకు కూడా అతుక్కుపోయిందని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమెకు అక్కడి వైద్యులు నిసర్గ, సి.రోహన్‌రెడ్డి తదితరులు సర్జరీ నిర్వహించారు. ముందుగా గుండె పొరపైనున్న కణతిని తొలగించి.. గుండె గదుల మధ్య గోడకు ఉన్న పెద్ద రంధ్రాన్ని కూడా పూడ్చేసినట్లు తెలిపారు. త్వరగానే కోలుకోవడంతో శస్త్రచికిత్స చేసిన ఐదు రోజులకే ఆమెను డిశ్చార్జి చేశామని వివరించారు.

Updated Date - Jan 07 , 2025 | 04:11 AM