Seethakka: నేను మీ స్నేహితుడ్ని.. కాదు అన్నవి!

ABN, Publish Date - Mar 25 , 2025 | 04:48 AM

అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా పంచాయతీ కార్మికుల సమస్యలు, ఇతర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.

Seethakka: నేను మీ స్నేహితుడ్ని.. కాదు అన్నవి!
  • సభలో కూనంనేని వ్యాఖ్యలకు సీతక్క బదులు

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా పంచాయతీ కార్మికుల సమస్యలు, ఇతర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. పంచాయతీ కార్మికులకు గత నాలుగైదు నెలలుగా జీతాలు అందడం లేదన్నారు. సభలో ఉన్న మంత్రి సీతక్క కల్పించుకుని అలాంటిదేమీ లేదని, చెల్లింపులు చేశామని చెప్పారు. అయితే తనకు సమాచారం ఉన్నంతవరకు ఆదివారం ఉదయం వరకు జీతాలు రాలేదని.. ఒకవేళ వస్తే సంతోషిస్తానని కూనంనేని చెప్పారు. ‘నేను మీ స్నేహితుడ్ని.. వారికి వేతనాలు వస్తే సంతోషం’ అని వ్యాఖ్యానించారు. మంత్రి సీతక్క కల్పించుకుని ‘కాదు.. అన్నవి’ అంటూ బదులిచ్చారు.

Updated Date - Mar 25 , 2025 | 04:48 AM