Share News

KTR: కాంగ్రెస్‌ హయాంలో క్రైమ్‌ సిటీగా హైదరాబాద్‌

ABN , Publish Date - Jan 22 , 2025 | 05:41 AM

కాంగ్రెస్‌ నిర్లక్ష్యపు పాలనతో హైదరాబాద్‌ సుడిగుండంలో చిక్కుకుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సేఫ్‌ సిటీ.. కాస్తా క్రైమ్‌ సిటీగా మారింద ఆరోపించారు.

KTR: కాంగ్రెస్‌ హయాంలో క్రైమ్‌ సిటీగా హైదరాబాద్‌

సమస్యల సుడిగుండంలో మహానగరం

రేవంత్‌కు పాలన చేతకాదని ప్రజలకు అర్థమైంది

నగర అభివృద్ధిని గాలికి వదిలేశారు: కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ నిర్లక్ష్యపు పాలనతో హైదరాబాద్‌ సుడిగుండంలో చిక్కుకుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సేఫ్‌ సిటీ.. కాస్తా క్రైమ్‌ సిటీగా మారింద ఆరోపించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తలసాని నివాసంలో కేటీఆర్‌ మంగళవారం సమావేశమయ్యారు. నగరంల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో కంచెలు వేసి కాపాడిన ప్రభుత్వ పార్కులకు కాంగ్రెస్‌ పాలనలో రక్షణ లేకుండా పోయిందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతకాదనే నిజాన్ని హైదరాబాద్‌ వాసులు అర్థం చేసుకున్నారని చెప్పారు. కేసీఆర్‌ హయాంలో నిర్మించిన కట్టడాలు, నిర్మాణాల నిర్వహణ కూడా కాంగ్రెస్‌ సర్కారుకు చేతకావడం లేదన్నారు. ప్రభుత్వానికి హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కాపాడాలన్న సోయి లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా హైదరాబాద్‌లో అమలుకావడం లేదని ఆరోపించారు. గ్రామసభలు, వార్డుసభల పేరిట సర్కారు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌ అభివృద్ధిని గాలికొదిలేసిన సర్కారుకు నగర ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Updated Date - Jan 22 , 2025 | 05:41 AM