Ambedkar Statue: అంబేడ్కర్‌కు ఘన నివాళి
ABN, Publish Date - Apr 15 , 2025 | 05:52 AM
నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం సందర్శనకు ప్రభుత్వం తొలిసారిగా అనుమతినివ్వడంతో సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంబేడ్కర్‌కు నివాళులర్పించి, మ్యూజియం చూసి సంబరపడ్డారు.
125 అడుగుల విగ్రహానికి అంజలి ఘటించిన డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు
ఖైరతాబాద్, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం సందర్శనకు ప్రభుత్వం తొలిసారిగా అనుమతినివ్వడంతో సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంబేడ్కర్‌కు నివాళులర్పించి, మ్యూజియం చూసి సంబరపడ్డారు. మ్యూజియం లోపల ప్రముఖులతో అంబేడ్కర్ ఫొటోలు, రాజ్యాంగానికి ముందు, తర్వాత పరిస్థితులను వివరిస్తూ చేసిన ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి. విగ్రహం లోపల, బయట సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ సందర్శకులు సందడి చేశారు. సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బౌద్ధ సాధువులు అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. హెచ్‌ఎండీఏ అధికారులు అంబేడ్కర్ విగ్రహానికి భారీ క్రేన్ల సాయంతో పూలదండను వేశారు.
నివాళులర్పించిన ప్రముఖులు
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మం త్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీ కడియం కావ్య, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం మొదటి అంతస్తుకు వెళ్లారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదన్నారు.
ఆశయాలను సాధిద్దాం
కవాడిగూడ డివిజన్‌లోని రోటరీకాలనీలో వీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాబుజగ్జీవన్‌రాం, అంబేడ్కర్ విగ్రహాలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్, కార్పొరేటర్ జి రచనశ్రీ, వీబీ ఫౌండేషన్ చైౖర్మన్, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మిలతో కలిసి హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ తదితరులు అంబేడ్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు. రాచకొండ సీపీ సుఽధీర్‌బాబు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహానికి లైన్‌లో నిలబడి ఆయన నివాళులర్పించారు. కాగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.
ఆశయ సాధన దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు : సీఎం
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ ఆశయ సాధనలో ప్రజాప్రభుత్వం కొన్ని కీలక అడుగులు వేసిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ట్యాంక్‌బండ్ దగ్గర అంబేడ్కర్ విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, రాజనర్సింహా, ఎంపీ అనిల్‌కుమార్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. అనంతరం ప్రభు త్వం అమలుచేసిన పలు పథకాల గురించి ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ‘‘ఇదొక చారిత్రక సందర్భం. మూడు దశాబ్దాల కలను నిజం చేసిన సంకల్పం. ఎస్సీ వర్గీకరణపై ప్రజా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలికాపీని అందుకోవడం గొప్ప అనుభూతిని మిగిల్చిన క్షణం’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు
Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ
UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా
For AndhraPradesh News And Telugu News
Updated Date - Apr 15 , 2025 | 05:52 AM