Share News

ప్రజావాణికి 25 ఫిర్యాదులు

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:23 PM

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులకు సూచించారు.

ప్రజావాణికి 25 ఫిర్యాదులు
ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

నారాయణపేటటౌన్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 25 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్‌కు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా, ఆర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలం, ఆర్డీవో రాంచందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:23 PM