రెడ్‌క్రాస్ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు భూమి కేటాయించండి
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:13 PM
మహబూబ్‌నగర్‌లో రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్‌కు భూమి కేటాయించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ణదేవ్ వర్మను కోరారు. ఈ మేరకు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.

గవర్నర్‌కు ఎమ్మెల్యే యెన్నం వినతి
సానుకూలంగా స్పందించిన జిష్ణదేవ్ వర్మ
‘విద్యానిధి’పై అభినందన
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌లో రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్‌కు భూమి కేటాయించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ణదేవ్ వర్మను కోరారు. ఈ మేరకు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. రెడ్‌క్రాస్ సంస్థ రాష్ట్ర చైర్మన్, కార్యదర్శులతో కలిసి వినతిపత్రం అందజేశారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్న రెడ్‌క్రాస్ సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోనే ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించి, దాతల నుంచి రక్తం సేకరించి అవసరమైన వారికి అందజేస్తోందని పేర్కొన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్ కోసం ఆధునాతన భవనం అవసరం ఉందని గవర్నర్‌కు వివరించారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అధునాతన భవన నిర్మాణం కోసం అన్ని విధాల సహకరిస్తానని చెప్పారన్నారు. ఈ సందర్భంగా విద్యానిధి కోసం పాలమూరులో చేపడుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే గవర్నర్‌కు వివరించగా, ఆయన అభినందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సంస్థ రాష్ట్ర చైర్మన్ అజయ్‌మిశ్రా, కార్యదర్శి శ్రీరాములు, మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, రాష్ట్ర ఈసీ సభ్యులు రమణయ్య పాల్గొన్నారు.