అపూర్వ సమ్మేళనం
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:45 PM
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

మూసాపేట, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అలనాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు విశ్వనాథం, నారాయణ, జగదీశ్వర్‌జీ, శ్రీనివాస్‌రెడ్డి, శివరాములును ఘనంగా సన్మానించారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధితో పాటు తమ బ్యాచ్‌లో ఆర్థికంగా వెనకబడిన వారికి వెన్నంటూ ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతకుముందు అప్పటి గురువులు బుచ్చయ్య, శేషయ్య, నర్సింహులు మృతి చెందడంతో వారి జ్ఞాపకార్థం బస్టాండ్‌లో చలివేంద్రం ప్రారంభించారు. పూర్వ విద్యార్థులు వెంకటాంపల్లి రాజు, ఎండీ సలీం, గట్టు నరేష్‌గౌడ్, ప్రవీన్, రాము, దేవన్నయాదవ్ పాల్గొన్నారు.
ఇంటర్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
అడ్డాకుల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ 2010-12 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు గతంలో కలిసిమెలిసి చదువుకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం అలనాటి అధ్యాపకులను సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. అధ్యాపకులు రామారావు, వెంకటేశ్వర్లు, భాస్కర్, శాంతిరెడ్డి, శ్రీనివాసులు, విద్యార్థులు రాంబాబు, స్వాతి, రాఘవేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, మహేష్, ధర్మారాజు, పాండు, అరవింద్, శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.