Share News

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:08 PM

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన వరి పంటను విక్రయించుకొని మద్దతు ధరతో లబ్ది పొందాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలి
పేట సింగిల్‌ విండో కార్యాలయంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

- ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

- పేట విండోలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నారాయణపేట, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన వరి పంటను విక్రయించుకొని మద్దతు ధరతో లబ్ది పొందాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట సింగిల్‌ విండో కార్యాలయంలో రబీ సీజన్‌ వరి కొను గోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి, మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన గ్రేడ్‌ ఏ-కు క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 చెల్లి స్తుందన్నారు. ఈసారి విండో సిబ్బంది ధాన్యాన్ని అధిక మొత్తంలో కొనుగోలు చేయాలన్నారు. మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, విండో అధ్యక్షుడు న ర్సింహరెడ్డి, గట్టు విజయ్‌కుమార్‌, సలీం, మల్లే ష్‌, రాజేష్‌, మహేష్‌, అలేనూర్‌ వినోద్‌, వెంకు గౌడ్‌, మారుతి, రాంగోపాల్‌ తదితరులున్నారు.

కాకర్ల సేవలు అభినందనీయం

గత 17 ఏళ్లుగా కాకర్ల భీమయ్య స్వచ్చందంగా వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చే సి ప్రజల దాహార్తి తీర్చడం అభినందనీయమని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవా రం అఖిల భారత అయ్యప్ప ప్రచార సమితి, కాకర్ల సురేష్‌ వెల్ఫేర్‌ ట్రస్టు జిల్లా అధ్యక్షుడు కాకర్ల భీమయ్య ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. అధికారులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌, మల్‌రెడ్డిపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

దామరగిద్ద : దామరగిద్ద మండలం నర్సా పూర్‌, మల్‌రెడ్డిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మల్‌రెడ్డిపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ చేశారు. ఆ తర్వాత గట్రెడ్డిపల్లి గ్రామంలో మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:08 PM