వైభవంగా హనుమాన్ జయంతి
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:33 PM
హనుమాన్ జయంతిని పట్టణంలో పలు ఆలయాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు.

ఆంజనేయస్వామి కటాక్షం అందరిపై ఉండాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
ఊరూరా శోభాయాత్ర
మహబూబ్‌నగర్ న్యూటౌన్/టౌన్/దేవరకద్ర/గండీడ్/కోయిలకొండ/భూత్పూర్/నవాబ్‌పేట/రాజాపూర్/మిడ్జిల్/ముసాపేట/జడ్చర్ల, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి) : హనుమాన్ జయంతిని పట్టణంలో పలు ఆలయాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. బండమీదిపల్లి, వీరన్నపేట, అప్పన్నపల్లి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం, ఏనుగొండ, గిర్నిగడ్డ ఆంజనేయ స్వామి ఆలయాల్లో, సాంబ శివాలయంలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో వేకువజామును స్వామి వారికి పంచామృతాభిషేకాలతో అభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పట్టణంలోని 3వ వార్డు అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి ఆలయం, అంబభవాని ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొని, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముస్లింలు ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు. ముడా చైర్మన్ లక్ష్మన్‌యాదవ్, మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్ గౌడ్, నాయకులు మనోహర్, శివశంకర్, మాజీ కౌన్సిలర్ రామాంజనేయులు, హరిబాబు, రామకృష్ణ, శేఖర్, ఆలయ వ్యవస్థాపక అఽధ్యక్షుడు అభిమన్యురావు, బాండేకర్ విశ్వనాథ్, విజయ్‌కుమార్, పరాంకర్, లక్ష్మీనారాయణ, పతంగి పాల్గొన్నారు. దేవరకద్ర, కౌకుంట్ల, గండీడ్, కోయిలకొండ మండలం ఖాజీపూర్, నల్లవెల్లి, ఆచార్యపూర్, అనంతాపూర్, కోయిలకొండ గ్రామాల్లో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజల అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆది ఆంజనేయస్వామికి ఫల పంచామృత అభిషేకంతో పాటు 1008 తమల పాకులతో అర్చన నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. భూత్పూర్, నవాబ్‌పేట, రాజాపూర్, మిడ్జిల్, హన్వాడ మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో ఆంజనేయస్వామి ఆలయాల ప్రత్యేక పూజలతో పాటు హనుమాన్ చాలిస పటించారు. మూసాపేట, అడ్డాకుల మండల కేంద్రంతో ఆయా గ్రామాల్లో గ్రామాల్లో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. దాసరిపల్లిలో 41 రోజుల పాటు ఆంజనేయస్వామి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి ధరించి శ్రీశైలం యాత్రకు తరలివెళ్లారు. శాఖాపూర్ సీతారాంపల్లి చిత్రపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలతో పాటు విగ్రహ ఊరేగింపు నిర్వహించారు. జడ్చర్ల పట్టణంలోని పాతబజార్, పారిశ్రమికవాడ, నిమ్మబాయిగడ్డ, నాగసాల గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో హనుమాన్ జయంతి నిర్వహించారు. నాగసాల హనుమాన్ మందిరం నుంచి శోభాయాత్రను ప్రారంభించారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొకుండ సీఐ కమలాకర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.