పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:05 PM
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో మంగళవారం మద్దూర్‌లో రాస్తారోకో నిర్వహించి, ఖాళీ కుండలతో నిరసన వ్యక్తం చేశారు.

- సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో ఖాళీ గ్యాస్ కుండలతో రాస్తారోకో
మద్దూర్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో మంగళవారం మద్దూర్‌లో రాస్తారోకో నిర్వహించి, ఖాళీ కుండలతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పాత బస్టాండ్‌లో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఖాళీ గ్యాస్ సిలిండర్‌ను ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మాస్‌లైన్ డివిజన్ నాయకుడు కొండ నర్సింహ మాట్లాడుతూ ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్య తరగతి వర్గాలపై సిలిండర్ ధరను రూ.50 పెంచి భారం మోపడం సరైంది కాదన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిం చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్, పీవైఎల్, పీడీఎస్‌యూ, జిల్లా, మండల నాయకులు రాజప్ప, కృష్ణ, అంబటి, అంజి, కాశీనాథ్, గౌస్, లాలుప్రసాద్ తదితరులున్నారు.