ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియ
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:12 PM
యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఏర్పాటు 14 నెలల కాలంలో 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు గుర్తు చేశారు.

కాంగ్రెస్ వచ్చాక 60 వేల ఉద్యోగాల భర్తీ
ఈ నెల 16 నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 8(ఆంధజ్యోతి): యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఏర్పాటు 14 నెలల కాలంలో 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు గుర్తు చేశారు. జూన్, జూలై నెలల్లో అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు విడుదల కాబోతున్నాయని తెలిపారు. మంగళవారం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్‌తో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కూడా బలోపేతం చేశామన్నారు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్‌లు, రోడ్లు కాదని, యువతను భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడమే నిజమైన అభివృద్ధి అని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో విద్య, స్కిల్ డెవల్‌పమెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. అందులో భాగంగానే ఈనెల 16 నుంచి మహబూబ్‌నగర్ ఫస్ట్ పేరిట జిల్లా నిరుద్యోగ యువతకు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. త్వరలోనే గ్రూప్ 1, 2, 3, 4తోపాటు వీఆర్‌ఏ, వీఆర్‌వో నియామకాలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచేత అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. టెట్, డీఎస్సీ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన కోచింగ్ కూడా ఇప్పించనున్నామని పేర్కొన్నారు. స్కిల్‌డెవల్‌పమెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇప్పిస్తున్న సంగతి తెలిసిందేనని వెల్లడించారు. గ్రంథాలయ సంస్థల రాష్ట్ర చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ ఫస్ట్ పేరుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కోసం శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, శిక్షకులు రవికుమార్ లోకై, గాది బాలరాజు, నానియాదవ్, బి.రాజేంద్రచారి పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో తన సొంత నిఽధులతో నీట్, ఎంసెట్ క్రాష్ కోర్సులకు శిక్షణ ఇప్పిస్తున్న కేంద్రాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మంగళవారం పరిశీలించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. బోధన, హాస్టల్‌లో భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహబూబ్‌నగర్ ఫస్ట్ నవరత్నాల శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు.