Share News

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ముమ్మరంగా శిథిలాల తొలగింపు

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:21 PM

శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏప్రిల్‌ 10 వరకు గడువు విధించింది. అయినప్పటికీ సహాయక చర్యలు చేపడుతున్న ప్రాంతంలో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ రెస్క్యూ బృందాలు నిర్విరామంగా పనులు చేపడు తున్నారు.

 ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ముమ్మరంగా శిథిలాల తొలగింపు
బురద మట్టిని ఎత్తిపోస్తున్న ఎక్స్‌కవేటర్‌

- ఐదు యంత్రాలతో కన్వేయర్‌ బంకర్‌లోకి మట్టి, బురద తరలింపు

- ఒక్క రోజులో 15 మీటర్ల వరకు శిథిలాల తరలింపు

దోమలపెంట, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏప్రిల్‌ 10 వరకు గడువు విధించింది. అయినప్పటికీ సహాయక చర్యలు చేపడుతున్న ప్రాంతంలో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ రెస్క్యూ బృందాలు నిర్విరామంగా పనులు చేపడు తున్నారు. గురువారం నాటికీ ప్రమాద ఘటన జరి గి 41 రోజులు అయింది. 13.600 కిలో మీటర్ల నుం చి 13.730 మీటర్ల వరకు 15 అడుగుల ఎత్తుకు పే రుకుపోయి ఉన్న శిథిలాలను తొలగించేందుకు 100 మీటర్ల కన్వేయర్‌ బెల్ట్‌ను పొడిగించి సిద్ధం చేశారు. గురువారం మొదటి షిఫ్ట్‌లో సొరంగంలోకి వెళ్లిన రెస్క్యూ బృందాలు శిథిలాల తొలగింపు పను లు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొంటున్నా రు. డేంజర్‌ జోన్‌గా ఉన్న 43 మీటర్లను మినహా యించి... 155 మీటర్ల వరకు పేరుకుపోయి ఉన్న శిథిలాలను 15 మీటర్ల వరకు తొలగించారు. ఇందుకు 5 ఎక్స్‌కవేటర్లను ఉపయోగించి క న్వేయర్‌ బెల్ట్‌పై బురద మట్టిని పోస్తూ బ యటకు తరలిస్తున్నారు. ఉబికి వస్తున్న 10 వేల లీటర్ల ఊట నీటిని బయటకు పంపింగ్‌ చేసేందుకు 150 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన 5 మోటారు పంపులను ఉపయోగిస్తున్నారు. కాగా, శుక్రవారం మొదటి షిఫ్ట్‌ వరకు మరో 5 మీటర్ల శిథిలాలను తొలగించేందుకు రె స్క్యూ పనుల్లో పాల్గొనే సిబ్బంది లక్ష్యంగా ప నులు చేపడుతున్నారు. అయినా విరిగి పడి న టీబీఎం మిషన్‌ విడిభాగాలు మట్టిలో కూ రుకుపోయి ఉన్నందున వాటిని కత్తిరించు కుంటూ పనులు చేయాల్సి వస్తుంది. అందరి సమన్వయంతో పనులు కొనసాగితే ఈనెల 20 వరకు శిథిలాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచా రం. సహాయక చర్యల్లో ఆర్మీ అధికారులు వికాస్‌ సింగ్‌, విజయ్‌కుమార్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి డాక్టర్‌ హరీష్‌, సింగరేణి రెస్క్యూ మైన్స్‌ జీఎం భైద్య, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి, జయప్రకాష్‌, రైల్వే అధికారి రవీంద్రనాథ్‌, ఇరిగేషన్‌ డీఈ శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 11:21 PM