Share News

Cyber ​​criminal: రూ.2 కోట్ల మోసంలో సైబర్‌ క్రిమినల్‌ అరెస్టు

ABN , Publish Date - Apr 11 , 2025 | 07:45 AM

గత కొద్దిరోజులుగా నగరంలో కోట్లాది రూపాయలను కొల్లగిట్టిన సైబర్ నేరగాళ్లలో ఒకరిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మొత్తం రూ.2.01 కోట్లు కొల్లగొట్టిన ఆ సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Cyber ​​criminal: రూ.2 కోట్ల మోసంలో సైబర్‌ క్రిమినల్‌ అరెస్టు

- ఇతర నిందితుల కోసం గాలింపు

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌(Online trading)లో అధిక లాభాలంటూ బురిడీ కొట్టించి రూ.2.01 కోట్లు కొల్లగొట్టిన కేసులో నగరానికి చెందిన ఒక సైబర్‌ క్రిమినల్‌ను అరెస్ట్‌ చేశారు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ(Cyber ​​Crime DCP) తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన ఒక వ్యాపారికి టీనా మిట్టల్‌(Tina Mittal) అనే వ్యక్తి నుంచి కాల్‌ వచ్చింది. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులపై చిట్కాలు ఇస్తానని నమ్మబలికాడు. ప్రారంభంలో మంచి పెట్టుబడి చిట్కాలు చెప్పిన టీనా మిట్టల్‌ లాభాలు వచ్చేలా చేశాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. రేపు దుకాణాలు బంద్‌


city2.jpg

వ్యాపారికి నమ్మకం కలిగిన తర్వాత ట్రేడింగ్‌కు సంబంధించిన ఒక వాట్సాప్‌ గ్రూపు(WhatsApp group)లో యాడ్‌ చేశాడు. ఆ తర్వాత బాగా లాభాలు వచ్చినట్లు చూపించిన క్రిమినల్స్‌ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించారు. అలా అతని నుంచి రూ. 2.01కోట్లు పెట్టుబడులు పెట్టించారు. అనంతరం డబ్బులను విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ క్లోజ్‌ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే 5 నుంచి 10 శాతం కమీషన్‌ చెల్లించాలని, లేదంటే ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలని షరతు పెట్టారు.


city2.3.jpg

ఇదేదో మోసంలా ఉందని గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ద్వారా ట్రేడింగ్‌ పేరుతో మోసానికి పాల్పడిన ముఠాను గుర్తించారు. ఆ ముఠాలో హైదరాబాద్‌కు చెందిన పకీర్‌ శ్రీనివాసరెడ్డి(Pakir Srinivasa Reddy) ఒక నిందితుడిగా ఉన్నట్లు గుర్తించి గురువారం అరెస్ట్‌ చేశారు. అతని ద్వారా మిగిలిన క్రిమినల్స్‌ను అరెస్టు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ తెలిపారు. శ్రీనివాస్‏రెడ్డి ఐదు సైబర్‌క్రైమ్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు విచారణలో తేలింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Adilabad: కన్నీటి కష్టాలు

గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గించాలి

పేదలకు మూడు రంగుల కార్డులు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 11 , 2025 | 07:45 AM