Share News

జిల్లాలో మినీ రిజర్వాయర్లు ఏర్పాటు

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:09 PM

పేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథ కంలో భాగంగా జిల్లాలో నాలుగు మినీ రిజర్వాయర్లు ఏర్పాటు కాబోతున్నాయని దాంతో మత్స్య సంపద పెరుగుతుందని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

జిల్లాలో మినీ రిజర్వాయర్లు ఏర్పాటు
రాష్ట్ర ఫిషరీష్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- మత్స్య సంపద కోసం కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణానికి చర్యలు

- మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

నారాయణపేట న్యూటౌన్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): పేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథ కంలో భాగంగా జిల్లాలో నాలుగు మినీ రిజర్వాయర్లు ఏర్పాటు కాబోతున్నాయని దాంతో మత్స్య సంపద పెరుగుతుందని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో జిల్లా మత్స్యశాఖ సహకార సంఘం సర్వసభ్య సమావేశం సంఘం జిల్లా చైర్మన్‌ కాంత్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది. స మావేశానికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఫిష రీష్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, కార్పొరేషన్‌ చైర్మన్‌ జ్ఞానేశ్వర్‌లు హాజరై, మాట్లాడారు. జిల్లాలో మత్స్య సంపదను పెంచి ఇతర రా ష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే విధం గా కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణానికి ప్రభుత్వం చర్య లు తీసుకుంటోందన్నారు. జిల్లాకు త్వరలో మత్స్య మహిళా సంఘాలకు ఫిష్‌ క్యాంటీన్లు, మా ర్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి, దామరగిద్ద సింగిల్‌ విండో చైర్మన్‌ ఈదప్ప, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్‌ నాగరాజ్‌, మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, వైస్‌ చైర్మన్‌ కోనంగేరి హన్మంతు, ఆర్టీవో జిల్లా బోర్డ్‌ మెంబర్‌ పోషల్‌ రాజేష్‌కుమార్‌, డైరెక్ట ర్‌ నర్సింహనాయుడు, గౌరి శ్రీనివాస్‌ ఉన్నారు.

గెలుపోటములను సమానంగా తీసుకోవాలి

మక్తల్‌రూరల్‌/మరికల్‌/మాగనూరు : క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం ఊట్కూరు మండలం ఆనంపల్లి గ్రామంలో మండల స్థాయి టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ టోర్న మెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన బ్యాటింగ్‌ చేసి యువకులను ఉత్సాహపరిచారు. అంతకుముందు తిప్రాస్‌పల్లి గ్రామంలో నాభిశిల(శీతాలదేవి) బొడ్రాయి ప్రతి ష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఆయన హా జరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమీన్‌పూర్‌, పగిడిమర్రి గ్రామాలతో పాటు మ రికల్‌ మండలంలోని కన్మనూర్‌ గ్రామంలో సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. అలాగే, మాగనూరు మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్దనున్న కోనేరును ఎమ్మె ల్యే పరిశీలించి, శుభ్రం చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.

మక్తల్‌ పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో కొత్త సూగయ్య, రత్నమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ప్రారంభించి, ప్రజలకు అంబలిని అందించారు.

Updated Date - Apr 07 , 2025 | 11:09 PM